Begin typing your search above and press return to search.
ఉస్మానియా రెబల్ స్టూడెంట్ బయోపిక్
By: Tupaki Desk | 2 Aug 2019 4:35 AM GMTతెలుగు తెరపై బాయోపిక్ ల పరంపర కొనసాగుతోంది. చరిత్రలో హీరోలుగా నిలిచిపోయిన పరాజితుల గాథలు నేటితరం ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటుండటంతో దర్శకనిర్మాతలు ఈ తరహా చిత్రాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కేవలం ఒకే వర్గానికి చెందిన బయోపిక్ లే కాకుండా క్రీడా - రాజకీయ - సీనీరంగాలకు చెందిన వారి కథల్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారు. ఈ వరుసలోనే రెబల్ స్టూడెంట్ లీడర్ జార్జిరెడ్డి కథ తెరపైకి రాబోతోంది. 60వ దశకంలో ఉస్మానియా క్యాంపస్‌లో విప్లవ శంఖారావాన్ని పూరించిన విధ్యార్థి నాయకుడు జార్జిరెడ్డి. కేరళలోని పాల్ఘాట్ లో పుట్టిన జార్జిరెడ్డి విప్లవమే ఊపిరిగా సమసమాజ స్థాపన కోసం తన ఆయువునే ధారపోశాడు.
విద్యార్థి రాజకీయాల్లో వేగుచుక్కలా ఇప్పటికీ చరిత్ర చెప్పే సాక్షంలా జార్జిరెడ్డి జీవితం నిలుస్తోంది. పీడీఎస్‌యూ(ప్రోగ్రెసీవ్ డెమొక్రెటివ్ స్టూడెంట్స్ యూనియన్)ని స్థాపించి యూనివర్సీటీ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి తెర తీశారు. పీపుల్స్ వార్ అనుబంధ సంస్థగా చెప్పుకునే రాడికల్స్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ ఎస్ యు)తోనూ జార్జిరెడ్డికి మంచి సంబంధాలు వుండేవని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. దశాబ్దాల కిందట హీరోగా నిలిచిన జార్జిరెడ్డి ఉస్మానియా క్యాంపస్ లోనే హత్యకు గురికావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆయన జీవిత కథ ఆధారంగా `దళం` ఫేమ్ జీవన్ రెడ్డి `జార్జిరెడ్డి` పేరుతో ఓ బయోపిక్ ని తెరపైకి తీసుకొస్తున్నారు. పదేళ్ల విరామం తరువాత జీవన్ రెడ్డి రూపొందిస్తున్న సినిమా కావడం.. సంచలనం సృష్టించిన జార్జిరెడ్డి జీవితకథ కావడంతో ఈ చిత్రంపై సర్వత్రా అంచనాలు నెలకొన్నాయి.
`ఏ బయోపిక్ ఆఫ్ ద ఫర్గాటెన్ లీడర్` అనే ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వర్మ `వంగవీటి` బయోపిక్ లో రాధగా నటించిన సాండీ అలియాస్ సందీప్ ఇందులో జార్జిరెడ్డిగా నటించాడు. ఫస్ట్ లుక్ ని చిత్ర బృందం విడుదల చేసింది. ఎఫెక్టివ్ గా సందీప్ ఆహార్యం కనిపిస్తున్నా ఆ ప్లేస్ లో పేరున్న హీరో అయితే ఈ చిత్రానికి వచ్చే మైలేజ్ మరో స్థాయిలో వుండేది. సత్యదేవ్ కీలక పాత్రలో నటించాడు. అడుగడుగు రోమాంచితంగా వుండే కథ కాబట్టి ప్రేక్షకుల్ని ఎగ్జైట్ చేసే అంశాలు ఇందులో చాలానే వుంటాయి. గతంలో ఇదే కథ స్ఫూర్తితో తమ్మారెడ్డి భరద్వాజ `అలజడి` చిత్రాన్ని రూపొందిస్తే అది అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ స్థాయికి మించి `జార్జిరెడ్డి` సంచలనం సృష్టించాలని - సృష్టించే స్టఫ్ ఇందులో వుందని దర్శకుడు జీవన్ రెడ్డి చెబుతున్నాడు. అయితే భారీ అంచనాలు నెలకొన్ని ఈ కథని జీవన్ రెడ్డి అనుకున్న స్థాయిలో ప్రజెంట్ చేస్తే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఓ రేంజ్ లో రికార్డుల మోత మోగించడం ఖాయం.