Begin typing your search above and press return to search.

తమన్నా తళుకు బెళుకులు.. చూస్తూ ఉండిపోవాల్సిందే..!

By:  Tupaki Desk   |   25 Oct 2022 4:59 AM GMT
తమన్నా తళుకు బెళుకులు.. చూస్తూ ఉండిపోవాల్సిందే..!
X
మిల్కీ బ్యూటీ తమన్నా బాలీవుడ్ మూవీ చంద్ స రోషన్ చెహ్రా సినిమాతో తెరంగేట్రం చేయగా శ్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత రెండేళ్లు తమిళ సినిమాల్లో నటిస్తూ వచ్చిన అమ్మడు మళ్లీ హ్యాపీడేస్ తో తెలుగులో నటించింది.

హ్యాపీడేస్ సూపర్ హిట్ అవడంతో తమన్నాకి టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఇక అక్కడ నుంచి ముందు యువ హీరోలతో నటించి ఆ తర్వాత స్టార్ ఛాన్సులు అందుకుంది అమ్మడు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 20 ఏళ్లు కావొస్తున్నా ఇప్పటికీ యువ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తుంది తమన్నా.

కేవలం హీరోయిన్ గానే కాదు అమ్మడు స్పెషల్ సాంగ్స్ కి కేరాఫ్ అడ్రెస్ గా మారింది. హీరోయిన్స్ లో కొద్దోగొప్పో డ్యాన్స్ చేస్తూ అలరించే తమన్నాతో జోడీ కట్టేందుకు స్టార్స్ కూడా ఆసక్తి చూపించారు. స్టార్ హీరోలతోనే కాదు సీనియర్ స్టార్స్ తో కూడా తమన్నా జత కట్టింది.

చిరంజీఎవి నాగార్జున వంటి స్టార్స్ తో కూడా తమన్నా నటించింది. ఇప్పటికీ ఓ పక్క సీనియర్ ఫస్ట్ బెస్ట్ ఆప్షన్ గా తమన్నా తన సత్తా చాటుతుంది. మరోపక్క యువ హీరోలతో కూడా కలిసి చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంది. తెలుగుతో పాటుగా తమిళ, హిందీ పరిశ్రమల్లో కూడా తమన్నా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. రీసెంట్ గా తమన్నా నటించిన రెండు బాలీవుడ్ సినిమాలు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ బి సినిమాలతో హిందీ ఆడియన్స్ ని అలరించింది తమన్నా ఇక తెలుగులో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది యువ హీరో సత్యదేవ్ తో చేసిన గుర్తుందా శీతాకాలం సినిమా కూడా పూర్తి చేసిన తమన్నా ఆ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తుంది. ఇక దీపావళి సందర్భంగా గోల్డ్ కలర్ కట్టు శారీలో మెరుపులు మెరిపిస్తుంది అమ్మడు. మిల్కీ బ్యూటీ అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఇప్పటికీ తమన్నా తెరంగేట్రం చేసిన టైం లో ఎలా ఉందో అలానే లేలేత సొగసులతో అలరించేస్తుంది. తమన్నా దీపావళి స్పెషల్ షో తన ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. హీరోయిన్స్ ఈమధ్య సినిమాలతోనే కాదు ఫోటో షూట్స్ తో కూడా ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా తమన్నా తళుకు బెళుకులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.