Begin typing your search above and press return to search.
కొంత నయమనిపిస్తున్న స్టార్ వారసుడు
By: Tupaki Desk | 28 April 2019 7:56 AM GMTఒక సినిమా షూటింగ్ మొత్తం అయిపోయాక ఫైనల్ కాపీ చూసుకుని మళ్ళి రీ షూట్ అన్న ప్రాజెక్ట్ బహుశా అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ వర్మనే అయ్యుండాలి. బాలా లాంటి కల్ట్ దర్శకుడు టేకప్ చేసినా ఒరిజినల్ మేజిక్ రిపీట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. దీంతో ముందు అనుకున్న వర్మ టైటిల్ ని ఆదిత్య వర్మగా మార్చి సందీప్ వంగ అసిస్టెంట్ గిరిసాయను దర్శకుడిగా పరిచయం చేస్తూ తిరిగి తీస్తున్న సంగతి తెలిసిందే.
షూటింగ్ ఫుల్ స్వింగ్ లో ఉంది. విక్రం కొడుకు ధృవ్ మొదటి సినిమా కాబట్టి దీని మీద అభిమానుల ఫోకస్ ఎక్కువగా ఉంది. ముందు తీసిన మూవీలో లుక్స్ మీద చాలా కంప్లయింట్స్ వచ్చాయి యూనిట్ ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. హీరొయిన్ ని సైతం మార్చి ఇప్పుడు బనితా సందుని తీసుకున్నారు
ఇప్పుడు ఈ ఇద్దరి పిక్స్ ఆన్ లైన్ లోకి వచ్చాయి. ఒకరకంగా చూస్తే ధృవ్ చాలా బెటర్ అనిపిస్తున్నాడు. మరీ విజయ్ దేవరకొండతో పోల్చే సీన్ లేదు కాని బాలా తీసిన వెర్షన్ నాటి లుక్స్ తో పోలిస్తే బాగున్నాడు అనే ఫీలింగ్ అయితే కలుగుతోంది. హీరొయిన్ బనితా కూడా అతనికి తగ్గట్టే ఉంది.
ఒకపక్క హింది రీమేక్ కబీర్ సింగ్ ఒరిజినల్ దర్శకుడు సందీప్ తోనే రూపొందుతుండగా మరోపక్క ఈ తమిళ వెర్షన్ ను అతని అసిస్టెంట్ టేకప్ చేయడం విశేషం. అటుఇటుగా తక్కువ గ్యాప్ లోనే ఇవి విడుదల కాబోతున్నాయి. గురువును మరిపించే స్థాయిలో గిరిసాయ దీన్ని తీర్చిదిద్దాడో లేదో తెలియాలంటే విడుదల దాకా ఆగాల్సిందే