Begin typing your search above and press return to search.

సాహో గేమ్.. ఇప్పుడే అవ‌స‌ర‌మా?

By:  Tupaki Desk   |   31 July 2019 1:09 PM GMT
సాహో గేమ్.. ఇప్పుడే అవ‌స‌ర‌మా?
X
ప్ర‌భాస్ న‌టిస్తున్న తాజా చిత్రం `సాహో` ప్ర‌చారార్భాటం తెలిసిందే. ఒక్కో పోస్ట‌ర్ .. లిరిక‌ల్ సాంగ్ రిలీజ్ చేస్తూ నెమ్మ‌దిగా హ‌డావుడి పెంచుతోంది యు.వి.క్రియేష‌న్స్ టీమ్. త్వ‌ర‌లోనే ఓ రొమాంటిక్ లిరిక‌ల్ సాంగ్ లాంచ్ చేసేందుకు టీమ్ రెడీ అవుతోంది. ఈలోగానే `యాక్టివేటింగ్ జెట్ ప్యాక్` అంటూ ఓ కొత్త పోస్ట‌ర్ ని లాంచ్ చేశారు. మునివేళ్ల‌పై నిల‌బ‌డేలా ఫీల్ నిచ్చే యాక్ష‌న్ ని రెడీ చేస్తున్నాం. `సాహో ది గేమ్` త్వ‌ర‌లోనే యాక్టివ్ అవుతోంది! అంటూ ప్ర‌క‌టించారు.`పిక్స్ ఏ లాట్ ల్యాబ్` లో ఈ గేమ్ ని రూపొందించార‌ట‌.

మొత్తానికి బాహుబ‌లి యానిమేటెడ్ గేమ్స్ త‌ర‌హాలోనే `సాహో` గేమ్స్ ని రూపొందించి పాపుల‌ర్ చేస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. అయితే ఇంకా సినిమా రిలీజ్ కానే లేదు. అప్పుడే ఈ గేమ్స్ ఎందుకు? వీటి వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఏంటి? ఎందుకీ హ‌డావుడి? సైలెంటుగా ముందు ఓ నాలుగైదు హీరోయిన్ల గ్లామ‌ర్ పోస్ట‌ర్ల‌తోనే లేక ఏదైనా యాక్ష‌న్ స్ట‌ఫ్ తోనే హీట్ పెంచాలి కానీ? ఎందుకీ హ‌డావుడి? అంటూ ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. మాస్ ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించాలంటే వాళ్ల‌కు కాస్తంత రా కంటెంట్ ఏదైనా రివీల్ చేయాల‌ని సూచిస్తున్నారు.

అయినా ఇలా బాలీవుడ్ నే ఎందుకు ఫాలో చేస్తున్నారు? అంత అవ‌స‌రం ఏంటి? మ‌న‌కు ఈ ఫార్ములా వ‌ర్క‌వుట‌వుతుందా.. ప‌క్కా మాస్ కి ఎక్కుతుందా? కాస్త ఆలోచించండి అంటూ క్రిటిక్స్ లో చ‌ర్చ మొద‌లైంది. `సాహో`కి మార్కెట్ ప‌రంగా ఉన్న క్రేజు దృష్ట్యా ఓపెనింగుల‌కు డోఖా ఉండ‌దు. కంటెంట్ బావుంటే వసూళ్లు కుమ్మేస్తుంది. మూవీ క్వాలిటీ విజువ‌ల్స్ గురించి ఆలోచిస్తేనే బెట‌ర్. రిలీజ్ అయ్యాక గేమ్స్ గీమ్స్ అంటూ ఆర్భాటం చేస్తే బావుంటుంది కానీ ముందే ఎందుకు? అంటూ ప్ర‌శ్న‌ల్ని సంధిస్తున్నారు. ఇంత‌కీ వీఎఫ్ఎక్స్ లో క్వాలిటీ ఏ రేంజులో వ‌చ్చింది డార్లింగ్?