Begin typing your search above and press return to search.

40 ఏళ్లు రాక ముందే పెళ్లి చేసుకుంటుందట!

By:  Tupaki Desk   |   18 April 2021 3:30 PM GMT
40 ఏళ్లు రాక ముందే పెళ్లి చేసుకుంటుందట!
X
సౌత్‌ సీనియర్ స్టార్‌ హీరోయిన్‌ త్రిష హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలకు పైగానే అయ్యింది. ఈ అమ్మడు ఇప్పటికి సినిమాలు చేస్తూనే ఉంది. త్రిష పెళ్లి గురించి గత కొన్ని ఏళ్లుగా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఈమె వ్యాపారవేత్త అయిన వరుణ్‌ మణియన్ తో పెళ్లికి సిద్దం అయ్యింది. పెళ్లి నిశ్చితార్థం కూడా అయ్యింది. ఏం జరిగిందో ఏమో కాని పెళ్లి క్యాన్సిల్‌ అయ్యింది. ఎంగేజ్‌ మెంట్ ను బ్రేక్‌ చేసుకున్నట్లుగా ఇద్దరు ప్రకటించారు. త్రిష అప్పటి నుండి మళ్లీ పెళ్లి ప్రస్థావన అయితే తీసుకు రాలేదు కాని మీడియాలో ఆమె పెళ్లి గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. మళ్లీ త్రిష పెళ్లి గురించి తమిళ మీడియా వర్గాల్లో ప్రధానంగా వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం త్రిష వయసు నాలుగు పదులకు రెండేళ్లు తక్కువ. కొన్నాళ్ల క్రితం త్రిష ఒక ఇంటర్వ్యూలో నాలుగు పదుల వయసు లో అడుగు పెట్టడానికి ముందే పెళ్లి చేసుకుంటానంటూ చెప్పుకొచ్చిందట. కనుక ఆమె ఇప్పుడు పెళ్లికి సిద్దం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే త్రిష కు కాబోయే వాడు ఫిక్స్ అయ్యాడనే వార్తలు వస్తున్నాయి. గతంలో మాదిరిగా మళ్లీ ఒక వ్యాపారవేత్తతోనే త్రిష పెళ్లి జరుగబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. పెద్ద ఎత్తున త్రిష పెళ్లి వేడుక ఉంటుందని తమిళ సినీ వర్గాల వారు చెబుతున్నారు.

త్రిష కుటుబ సభ్యులు ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాదిలో పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. త్రిష పెళ్లి గురించి చాలా మంది వెయిట్‌ చేస్తున్నారు. ఆమె అభిమానులు మాత్రం త్రిష సినిమాల్లో కొనసాగాలని కోరుకుంటున్నారు. ఇప్పటికి సినిమాలు చేస్తూనే ఉన్న త్రిష పెళ్లి తర్వాత కూడా ఖచ్చితంగా సినిమాల్లో కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు. మొత్తానికి త్రిష పెళ్లి కనుక నిజంగానే ఫిక్స్‌ అయితే మాత్రం ఆమె అన్న మాట ప్రకారం 40 ఏళ్ల లోపే పెళ్లి చేసుకుంటున్నట్లు అవుతుందని మీడియా వర్గాల వారు అంటున్నారు.