Begin typing your search above and press return to search.
గెటప్ శ్రీను 'రాజు యాదవ్' ఫస్ట్ గ్లిమ్స్..!
By: Tupaki Desk | 17 April 2021 12:37 PM GMT'జబర్ధస్త్' కమెడియన్ గెటప్ శ్రీను సోలో హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ''రాజు యాదవ్''. 'నీది నాది ఒకే కథ' 'విరాటపర్వం' వంటి చిత్రాలకు చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన కృష్ణమాచారి ఈ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. సాయి వరుణవి క్రియేషన్స్ బ్యానర్ పై ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వాస్తవికతకు దగ్గరగా సమాజంలో మనం చూసే ఎన్నో పాత్రల మనస్తత్వాలను ప్రతిబింభించేలా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఇందులో గెటప్ శ్రీను సరసన అంకిత ఖారత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ ని చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది.
ఇందులో స్వీటీ పాత్రలో నటిస్తున్న అంకిత నడుచుకుంటూ వెళ్తుండగా.. గెటప్ శ్రీను పరుగెత్తుకుంటూ వచ్చి 'స్వీటీ..' అని పిలవగా ఆమె వెనక్కి తిరిగి చూస్తుంది. ''రాజు యాదవ్'' ఈ చిత్రానికి 'కనులు కనులను దోచాయంటే' ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పుడు విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ కి ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా ఉంది. దీనికి సాయిరామ్ ఉదయ్ సినిమాటోగ్రఫీ అందించగా.. బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రంలో ఆనంద్ చక్రపాణి - రూపాలక్ష్మి - ఉన్నతి - ఉత్తర ప్రశాంత్ - పవన్ రమేశ్ - సంతోష్ రాజ్ తదితరులు నటిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న 'రాజు యాదవ్' సినిమా గెటప్ శ్రీను ని హీరోగా నిలబెడుతుందేమో చూడాలి.