Begin typing your search above and press return to search.
మారుతిలా తీయలేకపోయారు!?
By: Tupaki Desk | 4 Aug 2018 6:26 AM GMTరీమేక్ లు అన్ని వేళలా సేఫ్ కాదు అనడానికి ఇదిగో ఇదే మరో గ్రేట్ ఎగ్జాంపుల్. ఒక దర్శకుడి షూస్ లో ఇంకో దర్శకుడు కాలు పెడితే ఎలాంటి తప్పిదాలు జరుగుతాయో .. ఈ సినిమా ప్రూవ్ చేసిందన్నది తమిళ క్రిటిక్స్ వాదన. హీరో ఎంత పాకులాడినా.. తప్పైతే జరిగిపోయింది. సినిమా ఫ్లాప్ టాక్ స్ప్రెడ్ అయిపోయింది. రివ్యూల్లోనే మ్యాటరెంతో తేలిపోయింది. అసలింతకీ ఏ సినిమా గురించి? అంటారా? చెక్ డీటెయిల్స్...
న్యాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా మారుతి `భలే భలే మగాడివోయ్` వంటి బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మతిమరుపు నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మారుతికి - నానీకి కెరీర్ బెస్ట్ సినిమాగా నిలిచింది. ఇంకా చెప్పాలంటే అప్పటికే వరుస ఫ్లాపులతో అంపశయ్య మీద ఉన్న నానీని తిరిగి వెనక్కి తెచ్చిన సినిమా ఇది. మతిమరుపు కుర్రాడిగా నాని స్టన్నింగ్ పెర్ఫామెన్స్ - మారుతి కామెడీ టైమింగ్ పెద్ద రేంజులో వర్కవుటవ్వడంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది. ఆ క్రమంలోనే ఈ సినిమాని తమిళంలో ఆర్య హీరోగా గజినీకాంత్ గా రీమేక్ చేశారు. అయితే ఈ సినిమా రిజల్ట్ ఏంటి? అంటే తేడా కొట్టిందన్న మాట వినిపిస్తోంది.
నాని పాత్రలో ఆర్య నటించాడు. కానీ ఆ పాత్ర కామెడీ పండించడంలో పూర్తిగా ఫెయిలైందన్నది విమర్శకుల విశ్లేషణ. ఇక దర్శకుడి పనితనంపైనా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మొత్తానికి రీమేక్ అంటేనే ప్రమాదంతో చెలగాటం అన్న సంగతిని గజినీకాంత్ ప్రూవ్ చేసినట్టైంది. ప్రస్తుతం దీనిపై సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది.