Begin typing your search above and press return to search.

కోలీవుడ్ భలే భలే చూశారా

By:  Tupaki Desk   |   11 Jan 2018 2:23 PM GMT
కోలీవుడ్ భలే భలే చూశారా
X
ఎక్కువగా మనవాళ్లు కోలీవుడ్ కథలను రీమేక్ చేస్తుంటారు. అలాగే అప్పుడపుడు కోలీవుడ్ హీరోలు కూడా మన కథలను రీమేక్ చేస్తుంటారు. అదే తరహాలో కోలీవుడ్ హీరో ఆర్యా కూడా ఇప్పుడు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ హిట్ కథను తమిళ్ ప్రేక్షకులకు చూపించబోతున్నాడు. తెలుగులో నాని నటించిన బలే బలే మగాడివోయ్ సినిమా ఎంతటి ఘానా విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే.

మారుతి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా నాని కెరీర్ ను ఒక్కసారిగా మలుపు తిప్పింది. అయితే ఇప్పుడు అదే తరహాలో తన కెరీర్ ని కూడా ఒక ట్రాక్ లో పెట్టుకోవాలని ఆర్య ప్రయత్నాలు చేస్తున్నాడు. కాన్సెప్ట్ అదే అయినా తెరకెక్కించిన విధానం కొంచెం కొత్తగా అనిపిస్తోంది. గజినీకాంత్ అనే ఆ సినిమా టీజర్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు. మన BBM కు సినిమాకు ఆ సినిమాకు చాలా తేడా కనిపిస్తోంది. రజినీకాంత్ ఫ్యాన్ గా మతిమరుపుతో హీరో కనిపిస్తున్నాడు. అందుకు తగ్గట్టుగా గజినీకాంత్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు.

ప్రముఖ నిర్మాత జ్ఞాన్ వెల్ రాజా నిర్మిస్తోన్న ఈ సినిమాకు సంతోష్ పి జయకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఆర్య సరసన సయేశా నటిస్తోంది. బాలమురళీ బాలు సంగీతాన్ని అందిస్తున్నారు. మరి తెలుగులో నాని కెరీర్ కు బూస్ట్ ఇచ్చిన ఆ మతిమరపు కాన్సెప్ట్ ఆర్యకు ఎంతవరకు సక్సెస్ ని ఇస్తుందో చూడాలి.