Begin typing your search above and press return to search.
ఓటీటీలోకి వచ్చేస్తున్న 'గని'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే?!
By: Tupaki Desk | 9 April 2022 11:30 PM GMT'గద్దలకొండ గణేష్' తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నుండి వచ్చిన తాజా చిత్రం 'గని'. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా.. నవీన్ చంద్ర, ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతిబాబు ముఖ్య పాత్రలను పోషించారు. బడా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిల్మ్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్ల పై సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందించాడు.
బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడి.. చివరాఖరకు ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చి యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. తండ్రి ఆశయం కోసం నేషనల్ ఛాంపియన్ కావాలనుకునే కుర్రాడి కథే 'గని'.
వరుణ్ తన నటన, మేకోవర్‌తో మిస్మరైజ్ చేసినా.. ఈ సినిమా కథలో ఎక్కడా కొత్తదనమనేది కనిపించదు. స్లోగా సాగే కథనం, ప్రేక్షకులు కోరుకునే ట్విస్ట్ లు లేకపోవడం, పేలవమైన సంభాషణలు, రొటీన్ ఫార్ములా సాంగ్స్ సినిమా కు మరింత మైనస్‌గా మారాయి.
పైగా థియేటర్స్‌లో 'ఆర్ఆర్ఆర్' రన్ అవుతుండటం తో.. గని ఓపెనింగ్స్ కూడా అంతంత మాత్రం గానే వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే కరోనా వచ్చిన తర్వాత థియేటర్స్‌లో విడుదలైన చిత్రాలన్నీ నాలుగైదు వారాలలోపే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అందులోనూ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన చిత్రాలైతే రెండు వారాలకే ఓటీటీ బాట పడుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే 'గని' సినిమా కూడా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అవుతోంది. అల్లు అరవింద్ సమర్పణలోనే గని నిర్మితమవడంతో.. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు 'ఆహా'కే సొంతం అయ్యాయి.
అయితే ఏప్రిల్ 8న విడుదలైన ఈ చిత్రం సరిగ్గా మూడు వారాల తర్వాత అంటే ఏప్రిల్ 29 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై త్వరలోనే ఆహా టీమ్ అధికారిక ప్రకటన సైతం ఇవ్వనుందని టాక్.