Begin typing your search above and press return to search.
సెన్సార్ పూర్తి.. బాబాయ్ అబ్బాయి 'పంచ్' తప్పదా?
By: Tupaki Desk | 16 Feb 2022 6:30 AM GMTమెగా హీరో వరుణ్ తేజ్ నటించిన గని సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఎ సర్టిఫికెట్ ను ఇవ్వడం జరిగింది. రెండున్నర గంటల రన్ టైమ్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నిన్న ఉదయం ఈ సినిమా ను ఫిబ్రవరి 25న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించి డేట్ పోస్టర్ ను కూడా విడుదల చేయడం జరిగింది. భీమ్లా నాయక్ వాయిదా అనే ఉద్దేశ్యంతో గని సినిమా ను ప్రకటించారు.
గని సినిమా ఫిబ్రవరి 25కు రాబోతుంది అని అధికారిక ప్రకటన వచ్చిన కొన్ని గంటల్లోనే భీమ్లా నాయక్ ను అదే తేదీకి అంటే ఫిబ్రవరి 25కు విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించి పోస్టర్ ను కూడా విడుదల చేశారు. టికెట్ల రేట్ల పెంపు జీవో వస్తుందని ఇన్ని రోజులు వెయిట్ చేసిన భీమ్లా నాయక్ మేకర్స్ ఇక లాభం లేదని విడుదల తేదీని ప్రకటించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో గని పరిస్థితి ఏంటా అంటూ అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
భీమ్లా నాయక్ రాకపోవచ్చు అనే ఉద్దేశ్యంతో గని సినిమా మాత్రమే కాకుండా శర్వానంద్ హీరోగా నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా కూడా విడుదల అవ్వబోతుంది. ఇంకా చిన్నా చితకా సినిమాలు మరియు డబ్బింగ్ సినిమాలు కూడా అదే తేదీన విడుదల అవ్వబోతున్నాయి. దాంతో ఫిబ్రవరి 25కి బాగా డిమాండ్ ఉంది. దాంతో గని సినిమా ను ఆ రోజున విడుదల చేయడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
ఇప్పటి వరకు ఆరు ఏడు సార్లు గని సినిమా విడుదల తేదీని మార్చుతూ వచ్చారు. ఈసారి అయినా పక్కా అనుకుంటూ ఉండగా అనూహ్యంగా భీమ్లా నాయక్ రంగంలోకి దిగడంతో మొత్తం సీన్ తారు మారు అయ్యింది. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. భీమ్లా నాయక్ తో పోటీకి కచ్చితంగా గని ఆసక్తి చూపించక పోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
బాబాయి అబ్బాయి మద్య పోటీని మెగా అభిమానులు కూడా కోరుకోవడం లేదు. మెగా సినిమాలు ఇప్పటి వరకు రెండు ఒకే సారి విడుదల అవ్వడం జరగలేదు. ఈ రేంజ్ బజ్ ఉన్న రెండు సినిమాలను కూడా ఇలా క్లాష్ అయ్యే విధంగా విడుదల చేయడం అనేది అవివేకం అవుతుందని కూడా సినీ విశ్లేషకులు అంటున్నారు. పవన్ జోరు ముందు వరుణ్ తేజ్ ఎలా నిలుస్తాడు. అందుకే వాయిదా తప్పక పోవచ్చు అనే టాక్ వినిపిస్తుంది.
భీమ్లా నాయక్ విడుదల తేదీ ప్రకటించన తర్వాత గని ని వాయిదా వేస్తున్నట్లుగా మేకర్స్ నుండి ఎలాంటి స్పష్టత కాని.. లీక్ కాని రాలేదు. దాంతో గని కూడా అదే ఫిబ్రవరి 25న విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కొందరు భావిస్తున్నారు. అసలు విషయం ఏంటి అనేది నేడో రేపో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. భీమ్లా నాయక్ రిలీజ్ విషయంలో పవన్ జోక్యం ఎంత వరకు అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది