Begin typing your search above and press return to search.
'గని' ఇక రెడీ .. రింగులోకి దిగడమే తరువాయి!
By: Tupaki Desk | 30 Jan 2022 9:30 AM GMTకరోనా అనేది కాలు పెట్టడానికి ముందే వరుణ్ తేజ్ హిట్లు కొట్టేసి ఉన్నాడు. వరుణ్ తేజ్ ప్లానింగ్ వలన కరోనా మధ్యలో కొంతకాలం బ్రేక్ ఇచ్చినప్పటికీ, ఆయన సినిమాలు థియేటర్లలో కనిపించలేదు. కొంతకాలంగా ఆయన 'ఎఫ్ 3' .. 'గని' సినిమాలు చేస్తూ వచ్చాడు. మొత్తానికి 'గని' సినిమాను పూర్తిచేశాడు. రీసెంట్ గా ఆయన డబ్బింగ్ చెప్పడంతో, ఆ సినిమాకి సంధించిన ఆ పనులు కూడా పూర్తయ్యాయి. మార్చి 18వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.
ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ పాత్రలో కనిపించనున్నాడు. పాత్రలో ఒదిగిపోవాలనే ఉద్దేశంతో ఆయన విదేశాలలో శిక్షణ కూడా తీసుకున్నాడు. తన శరీరాకృతిని కూడా అందుకు తగినట్టుగా మార్చుకున్నాడు. అల్లు బాబీ - సిద్ధు ముద్ద నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో తెలుగు తెరకి కథానాయికగా సయీ మంజ్రేకర్ పరిచయమవుతోంది. ఇక ఒక కీలకమైన పాత్రలో జగపతిబాబు నటించగా, సునీల్ శెట్టి .. ఉపేంద్ర .. నవీన్ చంద్ర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.
ఇక ఒక ప్రత్యేకమైన పాత్రను నదియా పోషించింది. ఆమె పాత్రకి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఇంతవరకూ ఆమె చేస్తూ వచ్చిన పాత్రలకి, ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ పాత్ర ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. నిజానికి ఈ సినిమాను డిసెంబర్ లోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ ఒక వైపున 'అఖండ' .. మరో వైపున 'పుష్ప' .. 'శ్యామ్ సింగ రాయ్' బరిలో ఉండటం వలన ఆ ఆలోచనను విరమించుకున్నారు. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.
ఇక ఇదే ఏడాదిలో వరుణ్ తేజ్ 'ఎఫ్ 3' కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా ఇప్పటికే ముగింపు దశకి చేరుకుంది. మరో ప్రధానమైన కథానాయకుడిగా వెంకటేశ్ నటిస్తున్న ఈ సినిమాలో, నాయికలుగా తమన్నా .. మెహ్రీన్ అందాల సందడి చేయనున్నారు. ఇక ఈ భాగంలో సునీల్ .. అంజలి .. సంగీత.. సోనాల్ చౌహన్ కొత్తగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇక వీళ్ల వైపు నుంచి నవ్వుల సందడి ఎలా ఉంటుందనేది చూడాలి.