Begin typing your search above and press return to search.
బాబాయ్ కోసం అబ్బాయ్ మరో త్యాగం
By: Tupaki Desk | 20 Feb 2022 5:53 AM GMTబాక్సాఫీస్ వద్ద మరోసారి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మానియా వర్కవుట్ కానుందా? భీమ్లానాయక్ బంపర్ హిట్ కొడుతుందా? ప్రస్తుతం ట్రేడ్ వర్గాలు సహా అభిమానుల్లో సాగుతున్న ఆసక్తికర చర్చ ఇది. ఏపీలో టికెట్ రేట్ల సన్నివేశం చూశాక... కొందరిలో కొన్ని రకాల సందేహాలు ఉన్నాయి.
దీనికి తోడు అబ్బాయ్ వరుణ్ తేజ్ నటించిన గని రిలీజైతే కొంత అదనపు ఇబ్బంది భీమ్లాకు తప్పదు. వకీల్ సాబ్ కి అయినట్టే అవుతుందన్న డౌట్లు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఇకపోతే బాబాయ్ పవన్ కల్యాణ్ కి ఎలాంటి ఇబ్బందీ లేకుండా సైడివ్వడం కోసం వరుణ్ తేజ్ గని చిత్రాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నాడన్న టాక్ ఉంది. వరుణ్ తేజ్ నటించిన బాక్సింగ్ కాన్సెప్ట్ మూవీ గని రిలీజ్ తేదీని మార్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
భీమ్లాకు సైడిస్తూ గని చిత్రాన్ని ఫిబ్రవరి 25 నుంచి మార్చి 4వ తేదీకి మార్చారని టాక్ వచ్చింది. అయితే ఇంతలోనే ఈ తేదీ కూడా మారుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరోసారి పీకే నటించిన భీమ్లా నాయక్ కోసం వరుణ్ ఈ త్యాగం చేస్తాడని టాక్ వినిపిస్తోంది. మార్చి 4 కాకుండా మరో కొత్త తేదీకి రావాలని వరుణ్ భావిస్తున్నాడట. దానికి కారణం భీమ్లా నాయక్ రెండు వారాల ఫుల్ రన్ సాగాలనేది వ్యూహం. PK కోసం దారి ఇవ్వడమే దీనుద్ధేశం.
ఒకవేళ భీమ్లా రెండు వారాల పాటు చక్కని వసూళ్లను సాధించాలంటే ఇలా చేయాల్సిందేనని వరుణ్ భావించారట. ఒకవేళ మార్చి 4న గని వచ్చేస్తే అది బాబాయ్ సినిమాకి రెండో వారంలో పోటీగా మారుతుంది. బాబాయ్ మళ్లీ వకీల్ సాబ్ తరహా రిజల్ట్ ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మంచి టాక్ తెచ్చుకుని ఆరంభం బంపర్ కలెక్షన్లు సాధించి రెండో వారంలో వకీల్ సాబ్ చతికిలబడిపోయింది.
తొలి వీకెండ్ ముగిశాక మండే నుంచి ఆపసోపాలు పడింది. అప్పట్లో దానికి కారణం సెకండ్ వేవ్.. వేరొక సినిమా ఏదీ కాదు. కానీ ఇప్పుడు గని రూపంలో సమస్య ఉండకూడదనే తేదీల్ని మారుస్తున్నారని తెలిసింది.