Begin typing your search above and press return to search.

`పుష్ప` స్ఫూర్తితో `గ‌ని` పాన్ ఇండియాలోనా?

By:  Tupaki Desk   |   14 March 2022 2:30 AM GMT
`పుష్ప` స్ఫూర్తితో `గ‌ని` పాన్ ఇండియాలోనా?
X
మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `గ‌ని` ఇప్ప‌టికే రిలీజ్ కావాల్సిన చిత్రం. ప‌లు రిలీజ్ తేదీల్ని సైతం ప్ర‌క‌టించి వెన‌క్కి తీసుకుంది. `గ‌ని`కి ముందు...త‌ర్వాత మొద‌లైన సినిమాలు సైతం రిలీజ్ అయిపోయాయి. కానీ `గ‌ని` వాయిదాల మీద వాయిదా ప‌డుతుంది.

చివ‌రిగా ఫిబ్ర‌వ‌రి 25న రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కానీ ఆ తేదీకి రాలేదు. మ‌రి ఈ ఆల‌స్యానికి కార‌ణం ఏంటి? `గ‌ని` ఎలాంటి స్ర్టాట‌జీతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది? అన్న దానిపై ఆస‌క్తిక‌ర డిబేట్ న‌డుస్తోంది.

ఈ నేప‌థ్యంలో ఆస‌క్తిక‌ర సంగ‌తే లీక్ అయింది. `గ‌న‌`ని పాన్ ఇండియా కేట‌గ‌రిలీలో పెద్ద ఎత్తున రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్న‌ట్లు స‌మాచారం. `గ‌ని` బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్రం. వ‌రుణ్ తేజ్ బాక్స‌ర్ గా పాత్ర‌లో మెప్పించ‌నున్నాడు.

స్ర్కిప్ట్ డిమాండ్ మేర‌కు బాలీవుడ్ న‌టులు సాయి మంజ్రేక‌ర్..సునీల్ శెట్టి లాంటి టాప్ స్టార్ల‌ను సైతం ర‌గంలోకి దించారు. సినిమాలో ఈ రెండు పాత్ర‌లు చాలా కీల‌కం. సునీల్ శెట్టి-వ‌రుణ్ ల బాక్సింగ్ పోరు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని ఇప్ప‌టికే టాక్ ఉంది. సినిమా కోసం విదేశృ టెక్నీషియ‌న్లు సైతం ప‌నిచేసారు.

ఇదే సినిమాతో అల్లు అర‌వింద్ త‌నయుడు బాబి నిర్మాత‌గా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇలా సినిమాలో ఇన్ని ప్ర‌త్యేక‌త‌లున్నాయి. ఈ నేప‌థ్యంలోనే చిత్రాన్ని పాన్ ఇండియా కేట‌గిరీలో పెద్ద ఎత్తున రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.

ఆ కార‌ణంగానే స‌రైన రిలీజ్ తేదీని చూసుకుని ద‌క్షిణాదితో పాటు ఉత్త‌రాదిన పెద్ద ఎత్తున రిలీజ్ ప్లాన్ లో ఉన్న‌ట్లు గుస‌గుస వినిపిస్తోంది. ఇటీవ‌లి కాలంలో పాన్ ఇండియా కేట‌గిరిలో రిలీజ్ అయిన `పుష్ప` ఎలాంటి స‌క్సెస్ సాధించిందో చెప్పాల్సిన ప‌నిలేదు.

హిందీ బెల్డ్ లో అనూహ్య వ‌సూళ్ల‌ను సాధించింది. కేవ‌లం తెలుగులోనే తెర‌కెక్కిన సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ నే షేక్ చేసిన చిత్రంగా నిలిచింది. సౌత్ రీజియ‌న్ లోనూ మంచి వ‌సూళ్ల‌ను సాధించిది. ఇలా ఇన్ని పాజిటివ్ వైబ్స్ `గ‌ని`ని పాన్ ఇండియా రిలీజ్ వైపు అడుగులు వేయిస్తున్నాయ‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

ఆ కార‌ణంగానే `గ‌ని`ని వాయిదా వేస్తున్న‌ట్లు గుస‌గుస వినిపిస్తోంది. ఏప్రిల్ 8 వ తేదీని లాక్ చేసి పెట్టారు. మ‌రి అప్ప‌టిలోగా రిలీజ్ కి అన్ని ర‌కాల క్లియెరెన్స్ సిద్దం చేయ‌గ‌ల‌రా? పాన్ ఇండియా రిలీజ్ లో వాస్త‌వం ఎంత‌న్న‌ది? మరికొన్ని రోజుల్లోనే క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది.