Begin typing your search above and press return to search.
'గెలిస్తే చరిత్రలో ఉంటావ్'.. చరణ్ వాయిస్ తో అలరిస్తోన్న 'గని' టీజర్..!
By: Tupaki Desk | 15 Nov 2021 6:15 AM GMTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ''గని'' అనే స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అల్లు వెంకటేష్ - సిద్దు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - ఫస్ట్ సింగిల్ తో పాటు ప్రధాన పాత్రలను పరియం చేస్తూ విడుదల చేస్తోన్న పోస్టర్స్ ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా టీజర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది.
మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'గని' టీజర్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ అందించారు. 'ప్రతి ఒక్కరి కథలో కష్టాలు కన్నీళ్లు ఉంటాయి.. కోరికలు ఉంటాయి కోపాలు ఉంటాయి.. కలబడితే కొడవలు ఉంటాయి.. అలానే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఛాంపియన్ అవ్వాలనే ఆశ ఉంటుంది. కానీ విజేతగా నిలిచేది ఒక్కడే. ఆ ఒక్కడు నువ్వే ఎందుకు అవ్వాలి.. వై యూ?' అని చరణ్ చెప్పే డైలాగ్ తో ఈ టీజర్ మొత్తాన్ని చూపించారు.
ఇందులో హై వోల్టేజ్ యాక్షన్ తో పాటుగా లవ్ - ఎమోషన్స్ కూడా ఉన్నాయని అర్థం అవుతోంది. వరుణ్ తేజ్ ఈ చిత్రంలో ప్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించడానికి ఎంతలా కృషి చేసాడో 'గని' టీజర్ లో తెలుస్తోంది. వరుణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఉపేంద్ర - సునీల్ శెట్టి - జగపతిబాబు - నదియా - నరేష్ - తనికెళ్ళ భరణి - నవీన్ చంద్ర కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.
'గని' చిత్రానికి హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవల్ మరియు దిలీప్ సుబ్బరాయన్ కంపోజ్ చేసిన యాక్షన్ కొరియోగ్రఫీ హైలైట్ అని చెప్పాలి. 'ఆట ఆడినా ఓడినా రికార్డ్స్ లో ఉంటావ్.. కానీ గెలిస్తే మాత్రం చరిత్రలో ఉంటావ్' అని చెర్రీ వాయిస్ తో వచ్చిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. అబ్బూరి రవి ఇందులో డైలాగ్స్ రాశారు. దీనికి ఎస్ఎస్ థమన్ సమకూర్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాటోగ్రాఫర్ జార్జ్ సి.విలియమ్స్ విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాని రెనసాన్స్ పిక్చర్స్ మరియు అల్లు బాబీ కంపెనీ సంస్థలు నిర్మిస్తున్నాయి. రవీందర్ ఆర్ట్ డైరెక్టర్ గా.. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్ గా వర్క్ చేశారు. 'ఫైట్ విత్ ప్యాషన్.. విన్ విత్ ఎమోషన్స్' అనే క్యాప్షన్ తో వచ్చిన ''గని'' టీజర్ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. తమ్ముడు వరుణ్ కు అన్న చరణ్ మాట సాయం చేయడంతో అంచనాలు పెరిగిపోయాయి. మరి వరుణ్ కెరీర్ ను ఈ సినిమా ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.
ఇదిలావుండగా ఇప్పటి వరకు 'గని' చిత్రాన్ని డిసెంబర్ 3న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ చెబుతూ వచ్చారు. అయితే వచ్చే నెల 2న 'అఖండ' వస్తున్నట్లు అనౌన్స్ చేయడంతో.. వరుణ్ తేజ్ చిత్రాన్ని ముందుకు జరిపారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తాజాగా ప్రకటించారు. దీంతో నాని 'శ్యామ్ సింగ రాయ్' తో మెగా హీరోకి మధ్య క్లాష్ అనివార్యమైంది.