Begin typing your search above and press return to search.

బ్రో ఏంటీ 'గ‌ని' థీమ్ ని ఎత్తేశావ్? థ‌మ‌న్ పై పంచ్ లు!

By:  Tupaki Desk   |   22 Aug 2022 4:18 AM GMT
బ్రో ఏంటీ గ‌ని థీమ్ ని ఎత్తేశావ్? థ‌మ‌న్ పై పంచ్ లు!
X
సౌత్ లో అసాధార‌ణంగా ట్రోలింగ్ కి గుర‌య్యే సంగీత ద‌ర్శ‌కుల్లో థ‌మ‌న్ ఒక‌రు. అత‌డి సంగీతానికి అభిమానులు చాలాసార్లు హ‌ర్ట‌య్యారు. క్రియేట‌విటీ లేని ట్యూన్లు ఇస్తాడ‌ని.. కాపీ క్యాట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అని.. త‌న ట్యూన్లు తానే కాపీ కొడ‌తాడ‌ని ర‌క‌ర‌కాలుగా విమ‌ర్శ‌లు చెల‌రేగాయి. అయితే అన్నిటికీ చెక్ పెడుతూ 'అల వైకుంఠ‌పుర‌ములో' లాంటి యూనిక్ ఆల్బ‌మ్ తో మ్యాజిక్ ని క్రియేట్ చేశాడు థ‌మ‌న్. ఆ త‌ర్వాత ఎడా పెడా డ‌జ‌ను పైగా అగ్ర హీరోల సినిమాల‌కు థ‌మ‌న్ క‌మిట‌య్యాడు. ఇండ‌స్ట్రీలో బిజీయెస్ట్ సంగీత ద‌ర్శ‌కుడిగా క్ష‌ణ‌మైనా టైమ్ దొర‌క‌ని ప్ర‌తిభావంతుడిగా వెలిగిపోతున్నాడు.

ఇత‌రుల‌తో పోలిస్తే థ‌మ‌న్ అత్యంత వేగంగా ట్యూన్లు అందించ‌గ‌ల స‌మ‌ర్థుడిగానూ గుర్తింపు ఉంది. ద‌ర్శ‌క‌నిర్మాతల నుంచి ఒత్తిడి లేకుండా ప‌ని చేయ‌డ‌మెలానో తెలిసిన అభిన‌వ‌ చాణ‌క్యుడు థ‌మ‌న్. ఇటీవ‌ల అత‌డు ప‌ని చేస్తున్న క్రేజీ సినిమాల్లో మెగాస్టార్ గాడ్ ఫాద‌ర్ ఒక‌టి.

ఈ మూవీ టీజ‌ర్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (ఆగస్టు 22) సందర్భంగా విడుద‌లైంది. తెలుగు-హిందీ టీజ‌ర్ల‌ను విడుద‌ల చేయ‌గా అవి వైర‌ల్ గా మారాయి. టీజ‌ర్ ఆద్యంతం మెగాస్టార్ తో పాటు స‌ల్మాన్ భాయ్ మెరుపులు క‌నిపించాయి. మెగా బాసిజాన్ని మోహ‌న్ రాజా మ‌రో లెవ‌ల్లో ఆవిష్క‌రించాడ‌ని అర్థ‌మైంది. అయితే ఈ టీజ‌ర్ సంగీతం మాత్రం అభిమానుల‌కు రుచించడం లేదు. కాపీ క్యాట్... రిపీట్ థీమ్! అంటూ ఫ్యాన్స్ తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు.

'బ్రూస్ లీ: ది ఫైటర్‌' లో చిరు ఇంట్ర‌డ‌క్ష‌న్ కి అద్భుత‌మైన థీమ్(బిజిఎం) తో అందరి దృష్టిని ఆకర్షించిన థ‌మ‌న్ ఈసారి రిపీట్ ట్యూన్ అందించాడ‌ని ఆవేద‌న వ్య‌క్త‌మ‌వుతోంది. చిరంజీవి న‌టించే పూర్తి సినిమాకు థమన్ సంగీతం అందించాలని మెగాభిమానులు ఎప్పటి నుంచో వేచి చూస్తుంటే ఇప్పుడిలా తీవ్ర నిరాశకు గురి చేశాడు. గాడ్ ఫాదర్ టీజర్ థీమ్ (బిజిఎం) విన‌గానే వ‌రుణ్ తేజ్ 'గ‌ని' థీమ్ ను పోలి ఉంద‌ని విమ‌ర్శించారు. థమన్ లో క్రియేటివిటీ ఏమైంది? అతడు కొత్తగా ఆలోచించలేదేమిటో అంటూ పంచ్ లు విసురుతున్నారు.

త‌న ఆల్బ‌మ్స్ నుంచి పాత థీమ్ లోంచి ఒక దానిని మళ్లీ ఉపయోగించాడని నెటిజన్లు ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి కార‌ణాల‌తో థమన్ ట్రోల్ కి గుర‌వ్వ‌డం ఇదే మొదటిసారి కాదు. దాదాపు ప్రతి చిత్రానికి ఇలాంటి స‌న్నివేశ‌మే క‌నిపిస్తోంది. అల వైకుంఠ‌పుర‌ములో చిత్రానికి మాత్ర‌మే అత‌డు మ‌న‌సు పెట్టి ప‌ని చేశాడు. ఆ త‌ర‌వాత అంత‌గా శ్ర‌ద్ధ చూప‌లేద‌ని కూడా విమ‌ర్శిస్తున్నారు. అయినా థ‌మ‌న్ కి ఉన్న బిజీ షెడ్యూల్స్ న‌డుమ ప్ర‌తిసారీ అల వైకుంఠ‌పుర‌ములో త‌ర‌హా మ్యాజిక్ రిపీట్ చేయ‌డం సాధ్య‌ప‌డునా ? అంటూ కొంద‌రు సంగీత ప్రియులు విశ్లేషిస్తున్నారు. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ కి అవ‌స‌రమైన ఒరిజిన‌ల్ ట్యూన్ ని క్రియేట్ చేయ‌డంలో థ‌మ‌న్ విఫ‌ల‌మ‌య్యాడ‌నేది ఫ్యాన్స్ విమ‌ర్శ‌.

మోహన్ రాజా దర్శకత్వం వహించిన గాడ్ ఫాదర్ మలయాళంలో హిట్ అయిన లూసిఫర్ కి అధికారిక రీమేక్. గాడ్ ఫాద‌ర్ లో న‌య‌న‌తార కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌గా స‌ల్మాన్ ఖాన్ తొలిసారి టాలీవుడ్ సినిమాలో న‌టిస్తూ ఇక్క‌డా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.