Begin typing your search above and press return to search.

'బేషరమ్ రంగ్' గజల్ వెర్షన్ బెట‌ర్

By:  Tupaki Desk   |   11 Jan 2023 3:58 AM GMT
బేషరమ్ రంగ్ గజల్ వెర్షన్ బెట‌ర్
X
షారుఖ్ ఖాన్ 'పఠాన్' ట్రైల‌ర్ వ‌ర‌ల్డ్ క్లాస్ విజువ‌ల్స్ తో మ‌తులు చెడ‌గొట్టింది. వార్ ఫేం సిద్ధార్థ్ ఆనంద్ హాలీవుడ్ టేకింగ్ తో దుమారం రేపాడు. ఇక ఈ సినిమా పాటల్లో కిక్కు పెంచే లైన‌ప్ క‌నిపిస్తంది. దీపిక డ్యాన్సింగ్ హాట్ కంటెంట్ అప్పీల్ ప్ర‌తిదీ కుర్రకారును థియేట‌ర్ల వైపు లాక్కురావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇండియ‌న్ స్క్రీన్ పై నెవ్వ‌ర్ బిఫోర్ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ గా స్పై క‌థాంశంతో ఈ సినిమా రూపొందింది.

ఇక ఈ సినిమాలో బేషరమ్ రంగ్ పాట వివాదాస్ప‌ద‌మైన సంగ‌తి తెలిసిందే. షారుఖ్ ఖాన్ - దీపికా పదుకొణె జంట‌పై బేషరమ్ రంగ్ పాట చార్ట్ బ్ల‌స్ట‌ర్ జాబితాలో చేరింది. ఈ సంవత్సరంలో అత్యంత ప్రజాదరణ పొందిన పాటగా మారింది. ఇప్పుడు ఈ పాటకు సౌమ్య ముఖర్జీ గజల్ వెర్షన్ ను పాడారు.

అద్భుత‌మైన‌ ఎథోస్ రెండిషన్ తో గ‌జ‌ల్ గానం అల‌రించింది. ఒరిజిన‌ల్ సాంగ్ కంటే మెరుగ్గా ఇది రూపొందింది. ఈ అభిన‌వ గాయకుడు బేషరమ్ రంగ్ ను గజల్ గా ఎంత అందంగా మార్చారో ముగ్ధుల‌ను చేస్తోంది. SRK- దీపిక కూడా దీన్ని ఇష్టపడతారనడంలో సందేహం లేదు.

దీపికా పదుకొణె కాషాయ రంగు బికినీ కారణంగా బేషరమ్ రంగ్ పాట భారీ వివాదానికి దారితీసింది. చాలామంది గిట్టని వారు థియేటర్లలో అగ్గి రాజేసారు. ప్రముఖ నటి ఆశా పరేఖ్ సహా పరిశ్రమ నుండి చాలా మంది ఈ పాటకు మద్దతుగా నిలిచారు.

బేషరమ్ రంగ్ పాటలో దీపికా పదుకొణె అత్యంత ఆకర్షణీయమైన అవతార్ లో కనిపించింది. బికినీలో డీపీ నెవ్వ‌ర్ బిఫోర్ అనిపించేంత హాట్ గా అందాలు ఆర‌బోసింది. దీపికా- షారూఖ్ ఖాన్ జోడీ వావ్ అనిపించింది. ఈ పాట క‌చ్చితంగా థియేటర్లలో సినిమా ప్రేక్షకుల నుండి విజిల్స్ అందుకుంటుంది. పఠాన్ 25 జనవరి 2023న విడుదల అవుతుంది. మేకర్స్ ఇంకా ప్రమోషన్ ను పూర్తి స్థాయిలో ప్రారంభించలేదు.

అయితే తాజా స‌మాచారం మేర‌కు మిత్రుడు సల్మాన్ ఖాన్ షో బిగ్ బాస్ 16 కి దీపికా పదుకొనేతో కింగ్ ఖాన్ హాజ‌ర‌వుతార‌ని త‌న‌ సినిమాను ప్రమోట్ చేస్తార‌ని సమాచారం. ఇద్దరు ఖాన్ లు కలిసి స్క్రీన్ పై చెల‌రేగుతుంటే అది ఎలా ఉంటుందో చూడాల‌న్న ఉత్కంఠ అభిమానుల‌ను నిలువ‌నీయ‌డం లేదు.

మరి ఇదే జరిగితే అభిమానులందరికీ విజువల్ ట్రీట్ అవుతుంది. షారుఖ్ ఖాన్ పఠాన్ తో కంబ్యాక్ కోసం తీవ్రంగా శ్ర‌మిస్తున్నాడు.. కింగ్ ఖాన్ హ‌వాను చూడటానికి అభిమానులు థియేటర్ లో వీక్ష‌ణ కోసం వేచి చూస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.