Begin typing your search above and press return to search.
ఘాజీ మునిగినా.. సినిమా సేఫ్
By: Tupaki Desk | 19 April 2017 12:30 AM GMTఘాజీ.. దేశం మొత్తాన్ని ఆకర్షించిన మూవీ ఇది. సంకల్ప్ రెడ్డి అనే ఓ కొత్త దర్శకుడు తీసే సినిమా కోసం దేశమంతా ఆసక్తిగా చూసిందంటే.. అందుకు కారణం ఈ సినిమా కోసం ఎంచుకున్న కాన్సెప్ట్. దేశంలోనే తొలిసారిగా ఓ సబ్ మెరైన్ థీమ్ తో తెరకెక్కిన ఘాజీ.. అంచనాలకు మించిన విజయాన్నే ఎంచుకుంది.
తెలుగు.. తమిళ్.. హిందీ చిత్రాల్లో రిలీజ్ అయిన ఘాజీ.. ఫుల్ రన్ లో భారీ వసూళ్లనే సాధించింది. నైజాం నుంచి 4.50 కోట్లు.. ఉత్తరాంధ్ర 1.55 కోట్లు.. ఈస్ట్ 0.65 కోట్లు.. వెస్ట్ 0.45 కోట్లు.. కృష్ణా 0.85 కోట్లు.. గుంటూరు 0.70 కోట్లు.. నెల్లూరు 0.30 కోట్లు.. సీడెడ్ 0.80 కోట్లు వసూలవగా.. ఏపీ+తెలంగాణల్లో కలిపి మొత్తం 9.8 కోట్ల కలెక్షన్స్ సాధించింది. తమిళనాడులో 2.40 కోట్లు.. కర్నాటక నుంచి 2 కోట్లు.. రెస్టాఫ్ ఇండియా 10.25 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా ఇండియా వసూళ్లు 24.45 కోట్లు కావడం విశేషం. ఇక యూఎస్ఏ మార్కెట్ నుంచి 2 కోట్లు.. రెస్టాఫ్ వరల్డ్ 0.65 కోట్లు వచ్చాయి.
మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఫుల్ రన్ లో 27.1 కోట్లను వసూలు చేసింది ఘాజీ. రానా లాంటి ఫేమ్ ఉన్న హీరో ఉన్నా.. ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించిన సినిమా.. అందులోనూ మూడొంతులు ఓ సబ్ మెరైన్ లోనే ఉండే మూవీకి 27 కోట్లకు పైగా వసూళ్లు అంటే రికార్డ్ అనాల్సిందే. మూవీ మేకింగ్ కి పెట్టిన ఖర్చు ప్రకారం చూస్తే రిజల్ట్ పరంగా ఈ మూవీ సూపర్ హిట్ కేటగిరీలోకి చేరుతుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/