Begin typing your search above and press return to search.
ఘాజీ డైరెక్టర్ మామూలోడు కాడంట
By: Tupaki Desk | 11 Feb 2017 4:54 AM GMTఘాజీ.. ఇండియాలో తెరకెక్కిన తొలి అండర్ వాటర్.. సబ్ మెరైన్ వార్ ఫిల్మ్. ఇలాంటి భారీ ప్రయత్నాలు సాధారణంగా అనుభవజ్ఞులైన దర్శకులే చేస్తుంటారు. కానీ ఇప్పటిదాకా ఒక్క సినిమా కూడా తీయని.. 30 ఏళ్లు కూడా నిండని తెలుగు కుర్రాడు సంకల్ప్ ఇంత భారీ చిత్రాన్ని రూపొందించడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ‘ఘాజీ’లో కీలక పాత్రలు చేసిన అతుల్ కులకర్ణి.. కేకే మీనన్ లాంటి ప్రముఖ బాలీవుడ్ నటులు సంకల్ప్ మీద ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సబ్ మెరైన్ గురించి అతడికి ఉన్న అవగాహన అమోఘమని వాళ్లిద్దరూ కితాబిచ్చారు. లేటెస్టుగా రిలీజ్ చేసిన ‘ఘాజీ’ మేకింగ్ వీడియోలో సంకల్ప్ గురించి గొప్పగా మాట్లాడారు.
సంకల్ప్ చేతికి నిజంగా ఒక సబ్ మెరైన్ ఇచ్చేస్తే నడిపించేసేంత పరిజ్ఞానం అతడికి ఉందన్నారు అతుల్.. కేకే మీనన్. సబ్ మెరైన్ లోని ప్రతి చిన్న పరికరం గురించి అతడికి తెలుసని.. అతను ప్రతిదాని గురించి చెబుతుంటే విని ఆశ్చర్యపోయేవాళ్లమని వాళ్లు చెప్పారు. ఇండియాలో ఇలాంటి ఒక సినిమా తెరకెక్కడం.. ఒక దర్శకుడు ఇంత అథెంటిగ్గా సబ్ మెరైన్ గురించి తెలుసుకుని ఉండటం అద్భుతమన్నారు. సబ్ మెరైన్ లోపల షూటింగ్ కు అలవాటు పడ్డాక నిజంగానే ఒక సబ్ మెరైన్లో ఉన్న భావనే కలిగిందన్నారు. ఈ మేకింగ్ వీడియోలో రానా.. తాప్సి .. సంకల్ప్.. ప్రొడక్షన్ డిజైనర్ శివం రావు.. కూడా తమ అనుభవాల్ని పంచుకున్నారు. ‘ఘాజీ’ ఈ నెల 17న తెలుగు.. హిందీ.. తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే.