Begin typing your search above and press return to search.
వినాయక్ ఇల్లు కూల్చేసిన అధికారులు
By: Tupaki Desk | 26 Jun 2019 4:19 PM GMTగత రెండు రోజులుగా తెలుగు మీడియాలో అమరావతిలోని ప్రజావేదిక కూల్చివేత గురించిన వార్తలు జోరుగా వస్తున్న విషయం తెల్సిందే. ప్రజావేదిక కూల్చివేత విషయంలో వైకాపా మరియు టీడీపీ నాయకుల మద్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇలాంటి సమయంలోనే హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్న వివి వినాయక్ ఇంటిని రంగారెడ్డి జిల్లాకు చెందిన రెవిన్యూ అధికారులు కూల్చి వేయడం జరిగింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే... రంగారెడ్డి జిల్లాలోని వట్టినాగులపల్లి గ్రామంలో వివి వినాయక్ కు నాలుగు అంతస్తుల భవనం ఉంది. మొన్నటి వరకు గ్రామ పంచాయితీగా ఉన్న వట్టినాగులపల్లి తాజాగా వజ్రాలపల్లిని మున్సిపాలిటీగా మార్చి దాంట్లో కలిపేశారు. దాంతో మున్సిపల్ రూల్స్ ప్రకారం ఆ ప్రాంతంలో రెండు అంతస్తుల వరకు మాత్రమే భవనాలు నిర్మించాల్సి ఉంటుంది. కాని వినాయక్ ఇల్లు నాలుగు అంతస్తుల భవనం అవ్వడం వల్ల కూల్చి వేసినట్లుగా తెలుస్తోంది.
మూడు నెలల క్రితమే మున్సిపల్ మరియు రెవిన్యూ అధికారులు వినాయక్ కు నోటీసులు ఇవ్వడం జరిగిందని, కాని వినాయక్ నుండి ఎలాంటి స్పందన లేక పోవడంతో ముందస్తు సమాచారం లేకుండానే ఇంటిని నేలమట్టం చేశారంటూ సమాచారం అందుతోంది. ఈమద్య కాలంలో సినిమాలు లేక ఢీలా పడిపోయిన వినాయక్ కు ఇది మరో పెద్ద షాక్.