Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: ఇక 'ఘోస్ట్ స్టోరీస్' భీభత్సం
By: Tupaki Desk | 13 Dec 2019 1:51 PM GMTఆంథాలజీలు (నాలుగు కథలతో) తెరకెక్కించడంలో స్పెషలిస్టులు కరణ్ జోహార్- జోయా అక్తర్- అనురాగ్ కశ్యప్ - దిబాకర్ బెనర్జీ.. ప్రతిసారీ ఏదో ఒక సెన్సేషన్ తో హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఇంతకుముందు బాంబే టాకీస్ - లస్ట్ స్టోరీస్ ఈ తరహా ప్రయోగాలే. లస్ట్ స్టోరీస్ సంచలనం తర్వాత ఆ నలుగురు దర్శకులు చేస్తున్న మరో ఆంథాలజీ `ఘోస్ట్ స్టోరీస్`.
నెట్‌ఫ్లిక్స్ లో జనవరి ఒకటి నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ట్రైలర్ విడుదలైంది. ఇదో ఇంట్రెస్టింగ్ హారర్ కథల సమ్మేళనం. దెయ్యంగా మారిన అమ్మమ్మ వల్ల ఆ ఇంట్లో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి? అన్న థీమ్ ప్రధానంగా కనిపిస్తోంది. సమీరా అనే నర్స్ పాత్రలో జాన్వీ.. గర్భిణిగా గూఢచారి ఫేం శోభిత ధూలిపాళ.. కొత్తగా పెళ్లయిన యువతిగా మృణాళ్ ఠాకూర్... పిల్లల తండ్రిగా దిబాకర్ బెనర్జీ నటించారు. ఆ నలుగురి కథల్ని నలుగురు దర్శకులు డీల్ చేశారు.
ట్రైలర్ ఆద్యంతం భయం.. దెయ్యం చేష్టలు.. భీభత్సానికి సంబంధించిన మూవ్ మెంట్స్ తో రక్తి కట్టించింది. ఇక ఈ ట్రైలర్ కి అందించిన రీరికార్డింగ్ హై స్టాండార్డ్స్ లో ఆకట్టుకుంది. మునుముందు అంతటా వెబ్ సిరీస్ లదే అగ్ర తాంబూలం కాబోతోంది. ఆల్మోస్ట్ సినిమా చూస్తున్న ఫీల్ వెబ్ సిరీస్ లతో సాధ్యమవుతోంది కాబట్టి సినిమాలు.. టీవీ సీరియళ్లకు ఆల్టర్నేట్ ఆప్షన్ గా ఈ పరిశ్రమ ఎదుగుతోంది. స్టార్ డైరెక్టర్లు స్టార్ హీరోలు.. నాయికలు ఈ వేదికపై నటించేందుకు ఆసక్తి చూపిస్తుండడంతో వెబ్ సిరీస్ ట్రెండ్ అంతకంతకు జూమ్ అవుతోందనే చెప్పొచ్చు.