Begin typing your search above and press return to search.
విశ్వరూపం-2’ నీదే అనేశాడు..
By: Tupaki Desk | 14 Aug 2016 5:30 PM GMTఅప్పటికి సంగీత దర్శకుడిగా అతను చేసింది ఒకే ఒక్క సినిమా. అది కూడా చిన్న సినిమా. అయినా సరే.. కమల్ హాసన్ లాంటి దిగ్గజ నటుడు అతడికి పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు. అది కూడా ‘విశ్వరూపం-2’ లాంటి మెగా ప్రాజెక్టు అప్పగించాడు. తర్వాత ఇంకో మూడు సినిమాల్లో వరుస అవకాశాలు కల్పించాడు. ఆ సంచలన మ్యూజిక్ డైరెక్టరే జిబ్రాన్. మరి కమల్ తన సంగీతానికి అంతగా ఎలా ముగ్ధుడైపోయాడో.. తనకు ఎలా అవకాశం కల్పించాడో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు జిబ్రాన్. అతనేమన్నాడంటే..
‘‘తమిళంలో వాగై సూడ వా.. నా తొలి సినిమా. ఆ చిత్రానికి జాతీయ అవార్డు వచ్చింది. సంగీత దర్శకుడిగా నాకు మంచి పేరొచ్చింది. ఆ సమయంలో ఓ రోజు తెలిసిన వ్యక్తి ఒకాయన.. ‘కమల్ సార్ నీ పాటల గురించి మాట్లాడటం విన్నాను’ అని చెప్పాడు. అతనేదో జోక్ చేస్తున్నాడనుకున్నా. ఐతే మరోసారి ఇంకో పెద్దాయన కూడా అదే మాట చెప్పడంతో నాకది నిజమేనేమో అనిపించింది. ఇంకొన్ని రోజుల తరవాత కమల్ హాసన్‌గారు నన్ను కలవాలనుకుంటున్నట్లు ఆయన ఆఫీస్ నుంచే ఫోనొచ్చింది. నమ్మలేకపోయా. ఆయన్ని కలవడానికి ఢిల్లీ వెళ్లా. ఓ హోటల్ గదిలో కమల్ గారిని చూడగానే చాలా కంగారు పడిపోయా. నన్ను తేలిక పరచడానికి ‘మ్యూజిక్ లో బాగా చదువుకున్నావటగా, ఏం చదివావు?’ అని అడిగారు. అలా నా చదువు గురించి చెప్పడంతో మొదలైన సంభాషణ నాలుగ్గంటల పాటు కొనసాగింది. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అన్ని విషయాలూ.. ఎవరికీ తెలీని రహస్యాలూ తొలిసారి ఆయనతో పంచుకున్నా. కాసేపటి తర్వాత ‘విశ్వరూపం’ చూశావా అని అడిగారు. చూశానని చెప్పా. ‘సరే అయితే, ఇప్పుడు నువ్వు చేయబోయేది విశ్వరూపం-2’ అనేశారు. నాకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. అప్పటికప్పుడు ఓ సన్నివేశం చెప్పి పాటకు ట్యూన్ చేయించారు. అది ఆయనకు నచ్చింది. ఆ తర్వాత ఇంకో మూడు సినిమాల్లోనూ అవకాశాలిచ్చి నా స్థాయిని పెంచారు’’ అని జిబ్రాన్ చెప్పాడు.