Begin typing your search above and press return to search.
సైరా పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన గిరిబాబు
By: Tupaki Desk | 27 Nov 2019 5:02 AM GMTతెలుగు చిత్ర పరిశ్రమలోని సీనియర్ నటుల్లో గిరిబాబు గారు ఒకరు. ఆయన కుమారుడు రఘుబాబు ఇప్పుడు టాప్ లీగ్ కమెడియన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈమధ్య గిరిబాబు గారు ఒక ఇంటర్వ్యూలో 'సైరా' చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూయర్ గిరిబాబు ను "మీరు చిరంజీవి గారిని ఒక్కోసారి కష్టపడి పైకి వచ్చారని ప్రశంసిస్తారు ఒక్కోసారి విమర్శిస్తారు.. ఎందుకు?" అని అడిగితే ఆసక్తి కర సమాధానం ఇచ్చారు.
"చిరంజీవి తో నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఆయన తో ఎన్నో సినిమాల కు కలిసి పని చేశాను. చాలా మంచి వ్యక్తి. నాతో ఎంతో ఆత్మీయంగా ఉంటాడు. నేను చిరంజీవిని ఎప్పుడూ విమర్శించ లేదు.. మా అబ్బాయి బోసు బాబు సినిమా విషయంలో చిరంజీవి సినిమా నిర్మాతలు ఇబ్బంది పెట్టారు. వారిని మాత్రమే విమర్శించాను. చిరంజీవిని నేనెప్పుడూ అనలేదు. అంతెందుకు.. ఈమధ్య 'సైరా' కూడా చూశాను.. అద్భుతమైన సినిమా తీశావని చిరంజీవికి చెప్పా.. అయితే మనకు స్వత్రంత్ర్యం వచ్చి ఇప్పటికి 75 ఏళ్ళు అయింది. అప్పటి తరం వారు ఇలాంటి సినిమాలు చూసేవారు.. కానీ ఇప్పటికే మూడు తరాలు మారిపోయాయి.. జెనరేషన్ గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు ఇలాంటి సినిమాలు చూడరు అని చెప్పా. ఇంకా ఈ స్వతంత్ర పోరాటం సినిమాలు ఏం చూస్తారు? ఈ తరం యూత్ 'బాహుబలి' లాంటి సినిమాలు చూస్తారు.. లేదా పాకిస్తాన్ పై యుద్ధం.. క్లబ్బులు పబ్బులు.. డ్యాన్సులు ఫైట్లు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎప్పుడో స్వాతంత్ర్యం వచ్చింది. ఇంకా ఆ వేడి ఏముంటుంది అప్పట్లో సీతారామ రాజు లాంటి సినిమాలు చూశారు. ఇప్పడు చూడడం లేదు" అంటూ స్పందించారు.
సురేందర్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కిన 'సైరా' కు రివ్యూస్.. మౌత్ టాక్ బాగానే ఉన్నప్పటికీ కలెక్షన్స్ విషయంలో అంచనాలను అందుకో లేకపోయింది. తెలుగు రాష్ట్రాల లో కలక్షన్స్ భారీగా ఉన్నప్పటికీ బ్రేక్ ఈవెన్ కాలేదు. ఇక మిగతా భాషల్లో తీవ్రంగా నిరాశపరిచింది.