Begin typing your search above and press return to search.
గిరిబాబు సతీమణి కన్నుమూత
By: Tupaki Desk | 12 May 2016 6:23 AM GMTగత రెండు మూడేళ్లుగా సినీ పరిశ్రమలో అకాల మరణాలు చోటు చేసుకొంటున్నాయి. పలువురు ప్రముఖులు తరలిరాని లోకాలకి వెళ్లి చిత్ర పరిశ్రమని శోక సంద్రంలో ముంచారు. దీనిపై కలత చెందిన సినిమా కుటుంబం ఆమధ్య ప్రత్యేక హోమాలు కూడా నిర్వహించింది. ఆ పూజలు - హోమాల ఫలితంగానేమో కొంతకాలంగా చిత్ర పరిశ్రమలో మరణవార్తలు వినలేదు.
అయితే నిన్ననే దర్శకుడు విక్రమ్ గాంధీ మృతిచెందాడు. స్టేట్ రౌడీ - ప్రేమాభిషేకం లాంటి సినిమాలు చేసిన ఆయన బ్రెయిన్ క్యాన్సర్ తో మృతిచెందాడు. ఆ విషాదం మరిచిపోకముందే ఈరోజు మరో చేదువార్త వినాల్సి వచ్చింది. సినీయర్ నటుడు గిరిబాబు సతీమణి శ్రీదేవి(70) కన్నుమూశారు. గత కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గిరిబాబు తనయుడు రఘుబాబు ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ప్రముఖ కమెడియన్ గా కొనసాగుతున్నాడు.
గిరిబాబు - శ్రీదేవి దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారులు - ఓ కుమార్తె ఉన్నారు. వీరిలో పెద్దకుమారుడే రఘుబాబు. గిరిబాబు స్వగ్రామం ప్రకాశం జిల్లా రావినూతలలో శ్రీదేవి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.