Begin typing your search above and press return to search.

తెలుగు సింగర్స్ కు పాప పుట్టింది

By:  Tupaki Desk   |   2 July 2016 3:34 PM GMT
తెలుగు సింగర్స్ కు పాప పుట్టింది
X
ప్రముఖ తెలుగు సింగర్స్ అయిన.. హేమచంద్ర.. శ్రావణ భార్గవి.. చాలాకాలం ప్రేమించుకుని.. 2012లో ఎంగేజ్మెంట్‌ చేసుకున్నారు. 2013లో వేద మంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. ఆ జంట ఇప్పుడు పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది.

సింగర్‌ శ్రావణభార్గవి శనివారం (జూన్ 2న) ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఫేస్‌ బుక్‌ ద్వారా స్వయంగా తెలిపాడు భర్త హేమచంద్ర. ‘మాకు పాప పుట్టింది.. ఇప్పుడు నేను ఇద్దరు అమ్మాయిల్ని జాగ్రత్తగా చూసుకోవాలి..’ అని పేర్కొంటూ.. భార్య శ్రావణ భార్గవి, పాపాయితో కలిసి దిగిన ఫొటోను కూడా షేర్‌ చేశాడు. ఎన్నో హిట్టు పాటలను పాడిన ఈ సింగర్స్ ఇద్దరికీ ఇప్పుడు ఫిలిం ఇండస్ర్టీ నుండి విషెస్‌ వరదలా వచ్చిపడుతున్నాయి.

కంగ్రాట్స్ హేమచంద్ర.. శ్రావణ భార్గవి