Begin typing your search above and press return to search.

ఆ అమ్మాయి ఎవరు అఖిల్?

By:  Tupaki Desk   |   28 Dec 2017 4:22 AM GMT
ఆ అమ్మాయి ఎవరు అఖిల్?
X
యంగ్ ఏజ్ లో ప్రశంసలు దక్కించుకోవడం చాలా ఆనందం కలిగిస్తుంది. అదే ఓ అబ్బాయిని ఓ అమ్మాయి మెచ్చుకుందంటే ఆ ఆనందం డబులయిపోతుంది. ఆ ప్రశంస గుర్తొచ్చిన ప్రతిసారీ మనసు పులకించిపోతుంది కూడా. అక్కినేని హీరో అఖిల్ ప్రస్తుతం ఈ అనుభూతిని ఎంజాయ్ చేస్తున్నాడు.

అఖిల్ లేటెస్ట్ సినిమా హలో రీసెంట్ గా థియేటర్లకు వచ్చింది. విక్రమ్ కె.కుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ లవ్ స్టోరీ ప్రేక్షకులను బాగానే మెప్పించింది. లవ్ స్టోరీలంటే యూత్ తెగ ఇష్టపడతారు. ఇంకా నచ్చితే పొగుడుతూ మెసీజీలు పెడతారు. అలా అఖిల్ కు కూడా చాలానే మెసేజులు వచ్చాయి. అందులో ఒకటి మాత్రం తనకు భలేగా నచ్చేసింది అంటున్నాడు అంటున్నాడు. ‘‘నా మనసు దోచుకున్నావ్’’ అంటూ ఓ అమ్మాయి మెసేజ్ పెట్టిందని.. మిగతా అందరు మెచ్చుకున్న దానికంటే ఈ కామెంట్ మాత్రం తనకు తెగ నచ్చేసిందని చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆ మెసేజీ పెట్టిన భామ ఎవరు.. ఊరు పేరు గట్రా వివరాలేంటీ అనేది మాత్రం అఖిల్ బయటపెట్టలేదు.

అఖిల్ తండ్రి.. హీరో నాగార్జున లేడీస్ లో ఫ్యాన్స్ ఎక్కువ. టాలీవుడ్ మన్మథుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. మళ్లీ ఈ విషయంలో తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ అమ్మాయిల మనసు కొల్లగొడితే రొమాంటిక్ హీరోగా కెరీర్ లో తిరుగుండదు. ఇంతకీ అఖిల్ ను అంతగా ఇష్టపడిన ఆ చిన్నది ఎవరో.. తరవాతైనా బయటపెడతాడేమో చూడాలి.