Begin typing your search above and press return to search.
భీమ్లా నాయక్, డైరెక్టర్ కు కాస్త చోటివ్వండయ్యా బాబూ!
By: Tupaki Desk | 4 Sep 2021 1:30 PM GMTభీమ్లా నాయక్ సెట్స్ మీదకు మళ్లీ పవన్ కల్యాణ్ రావడం గురించి ఫొటోలు బయటకు వచ్చాయి. సెప్టెంబర్ రెండున పుట్టిన రోజును జరుపుకున్న పవన్ కల్యాణ్, మరో రోజు విరామం అనంతరం ఈ సినిమా సెట్స్ మీదకు వచ్చారు. ఇదే సమయంలో సెప్టెంబర్ రెండున ఈ సినిమా కు సంబంధించి కవర్ సాంగ్ ను విడుదల చేశారు. దాన్ని అభిమానులు ట్రెండ్ లో ఉంచారు. ఇక ఆ సినిమా పాట గురించి రకరకాల చర్చలు, అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి.
ఇంతలో పవన్ కల్యాణ్ ఆ సినిమా షూటింగ్ లో పాల్గొంటూ ఉన్నారు. సెప్టెంబర్ నాలుగు నుంచి పవన్ కల్యాణ్ లేటెస్ట్ షెడ్యూల్ మొదలైంది. అందుకు సంబంధించి ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ఈ ఫొటోలో రామజోగయ్య శాస్త్రి, సంగీత దర్శకుడు థమన్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, హీరో పవన్ కల్యాణ్ లు ఉన్నారు. మరి అంతా బ్యాలెన్స్ అయినట్టే. అయితే దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు దర్శకుడు కాకపోవడమే ఇక్కడ ఏదో మిస్ అయినట్టుగా అనిపిస్తుంది.
పవన్ కల్యాణ్ రెగ్యులర్ షూటింగ్ కు సంబంధించిన ఫొటో బయటకు వస్తే.. ఆ సమయంలో సినిమా యూనిట్ ఫొటో దిగితే.. అందులో దర్శకుడు ఉండి ఉంటే అదో రొటీన్. ఇక్కడ వెరైటీ ఏమిటంటే దర్శకుడికి అక్కడ చోటు లభించినట్టుగా లేదు. ఇప్పటికే ఈ సినిమా దర్శకుడు సాగర్ చంద్ర ఊసు వినిపించడం లేదు అనే అభియోగాలున్నాయి. ఈ సినిమాకు త్రివిక్రమ్ అంతా తానవుతున్నాడనే పేరును తెచ్చుకున్నాడు. ఈ ప్రచారాన్ని ఎవ్వరూ పని గట్టుకుని ఖండించడం లేదు. దానికి తోడు.. ఇలా దర్శకుడు కనిపించకుండా, త్రివిక్రమ్ మాత్రం హీరో పక్కనే నిలబడి, షూటింగ్ స్పాట్ లో ఉన్నట్టుగా అనిపిస్తే.. పాత ప్రచారానికే మరింత ఊపు వస్తోంది.
ఈ సినిమాకు దర్శకుడు అంటూ ఒకరున్నారనే అంశాన్ని కూడా క్రమంగా తెరమరుగు చేస్తున్నట్టుగా ఉంది వ్యవహారం. ఎంత త్రివిక్రమ్ ఈ సినిమా కోసం పని చేస్తే మాత్రం, పవన్ కల్యాణ్ కూ- నిర్మాతలకూ సన్నిహితుడు అయితే మాత్రం.. మరీ ఇంతలానా! దర్శకుడు అనే మాటకే ఈ తీరు అవమానం కలిగించేలా ఉందని చెప్పక తప్పదు!