Begin typing your search above and press return to search.
బిగ్ బాస్ లో గ్లామర్ డోస్ డబుల్.. హౌస్ లోకి సినీ స్టార్స్!
By: Tupaki Desk | 11 March 2021 2:30 AM GMT'బిగ్ బాస్..' తెలుగు రియాలిటీ షోస్ లో దీని క్రేజ్ మామూలుగా లేదు. తొలి రోజు కంటిస్టెంట్స్ పరిచయంతో మొదలయ్యే హంగామా.. చివరి రోజు గ్రాండ్ ఫినాలేలో టైటిల్ విన్నర్ ను ప్రకటించే వరకూ కొనసాగుతుంది. టీఆర్పీ రేటింగ్స్ లో ఏ మాత్రం తేడాలేకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు షో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుండడంతో నిర్వహాకులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
అయితే.. నాలుగో సీజన్ కంటిస్టెంట్లపై మాత్రం మొదట్లో కంప్లైంట్లు బాగానే వచ్చాయి. నామమాత్రంగా పాపులారిటీ ఉన్నవారిని ఏరుకొచ్చారని, దీనివల్లే షోకు రావాల్సినంత మైలేజ్ రాలేదనే అభిప్రాయం వ్యక్తమైంది. అయినప్పటికీ.. ఆ షో మంచిగానే మూవ్ అయ్యింది. అయితే.. ఈ సారి ఆ మాట రాకుండా చూసుకోవాలని డిసైడ్ అయ్యిందట యూనిట్.
కరోనా కారణంగా గత సీజన్ ఆలస్యమైనప్పటికీ.. ఈ సారి టంచన్ గా జూన్ లోనే మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యింది స్టార్ మా. ఈ మేరకు ఏర్పాట్లు మొదలై చాలాకాలమైంది. ఇప్పటికే కంటిస్టెంట్స్ ఎంపిక శరవేగంగా కొనసాగుతోంది. పలానా వారిని ఎంపిక చేయబోతున్నారంటూ లీకులు కూడా వస్తున్నాయి. అయితే.. ఈ సారి మామూలు వాళ్లని కాకుండా పాపులర్ క్యాండిడేట్లను, సినీ స్టార్స్ ను రంగంలోకి దించాలని చూస్తోందట.
రెమ్యునరేషన్ లెక్క ఎక్కువైనా పర్లేదుగానీ.. పాపులారిటీ విషయం మాత్రం తగ్గకుండా చూస్తున్నారు. మొత్తంగా.. బిగ్ బాస్-5 లో గ్లామర్ డోస్ గతంలో కంటే డబుల్ రేంజ్ లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి, ఫైనల్ గా ఎవరిని తీసుకురాబోతున్నారు? ఎంత మేర గ్లామర్ యాడ్ చేయబోతున్నారు అన్నది చూడాలి.