Begin typing your search above and press return to search.

టాలీవుడ్ గ్లామరస్ 'బ్లాక్ రోజ్' మూవీ ఏమైంది..?

By:  Tupaki Desk   |   15 May 2021 4:30 PM GMT
టాలీవుడ్ గ్లామరస్ బ్లాక్ రోజ్ మూవీ ఏమైంది..?
X
సినీ ప్రపంచంలో గ్లామర్ షోకు హద్దులు చెరిపేసిన భామలు చాలామంది ఉన్నారు. అలాంటి గ్లామరస్ హీరోయిన్స్ లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ముందు వరుసలో ఉంటుంది. బ్యూటీని ఆస్వాదించే ఆసక్తి ఉండాలే కానీ అలాంటి వారికి ఊర్వశి ఎల్లప్పుడూ అందగత్తె. కరోనా కాలమైనా.. లాక్డౌన్ అయినా కుర్రకారు అభిమానించే భామలలో ఊర్వశి ఖచ్చితంగా ఉంటుంది. అలా అందాలను వెతికే వారికోసమే ఈ అమ్మడు పుట్టిందని ప్రూవ్ చేసుకుంది. ఈ బాలీవుడ్ భామ ఎన్నో అందాలపోటీల్లో విజేతగా నిలిచి మోడలింగ్ లో రాణించి సినిమా రంగంలో సత్తా చాటుతోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో సెటిల్ అయ్యేందుకు తెగప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటివరకు స్పెషల్ సాంగ్స్ - స్పెషల్ క్యారెక్టర్స్ వరకే పరిమితమైంది.

అయితే ఈ వయ్యారి త్వరలోనే టాలీవుడ్ డెబ్యూ చేయనున్నట్లు తెలుస్తుంది. డైరెక్టర్ సంపత్ నంది స్క్రిప్ట్ అందించిన 'బ్లాక్ రోజ్' అనే థ్రిల్లర్ మూవీతో ఊర్వశి ఎంట్రీకి సిద్ధం అవుతోంది. మోహన్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఈ సినిమా.. గ్రేట్ రైటర్ షేక్స్ పియర్ 'ద మర్చంట్ ఆఫ్ వెనిస్'లో 'షైలాక్' అనే క్యారెక్టర్ ఆధారంగా లేడీ ఓరియంటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్‌ రూపొందిస్తున్నారు మేకర్స్. అలాగే 'విచక్షణలేని, యోగ్యతలేని ఆర్థిక లావాదేవీలు మరణానికి సంకేతం' అనే అర్థశాస్త్రంలోని కౌటిల్యుడి కాన్సెప్ట్‌ జోడిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు గతంలో చిత్రయూనిట్ తెలిపింది.

ఈ సినిమాలో 'అందరూ రోజ్ కొప్పులో పెట్టుకుంటారు. కానీ మా లేడీ షైలాక్ హిప్పులో పెట్టుకుంటుంది' అంటూ బ్లాక్ రోజ్ మూవీ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అయితే గతకొంతకాలంగా బ్లాక్ రోజ్ మూవీ గురించి రైటర్ కం డైరెక్టర్ సంపత్ నంది ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోవడంతో సినిమా పై పలు ఊహగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏంటంటే.. ఈ సినిమా ఆల్రెడీ ఆగిపోయిందని.. అందుకే ఊర్వశి గాని సంపత్ నంది - దర్శకుడు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమాను శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తుండగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. అటు హిందీ ఇటు తెలుగు భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా రూపొందుతుంది.