Begin typing your search above and press return to search.
భామలు నల్లకోటు ధరించి రఫ్ఫాడించేస్తారట
By: Tupaki Desk | 13 Oct 2021 12:30 AM GMTవెండితెర పై అందాల ఆరబోతలోనే కాదు.. నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లోనూ నేటితరం నాయికలు సత్తా చాటుతున్నారు. అవసరమైతే శివంగిలా మారిపోయి సీరియస్ పాత్రలను చేస్తున్నారు. పాత్రను బట్టి స్వరూపాన్ని మార్చుకుంటున్నారు. అగ్ర హీరోయిన్లు ఇప్పటికే లేడీ ఓరియేంటేడ్ చిత్రాల్లో రాణిస్తోన్న సంగతి తెలిసిందే. ఓవైపు సోలో భామలుగా రాణిస్తూనే అవసరం మేర అవకాశం దక్కితే లేడీ ఓరియెంటెడ్ కథల్లో తమదైన షో చూపించేస్తున్నారు.
తాజాగా హాట్ గాళ్స్ రాశీఖన్నా.. అను ఇమ్మాన్యుయేల్ తదుపరి చిత్రాల్లో కీలక పాత్రలు.. నటనకు ఆస్కారం ఉన్న రోల్స్ ని పోషిస్తున్నట్లు తెలుస్తోంది. మ్యాచోస్టార్ గోపీచంద్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో `పక్కా కమర్శియల్` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. పాత్ర డిమాండ్ మేరకు ఈ బ్యూటీ నల్లకోటు వేసుకుని లాయర్ గా కోర్టులో వాదించే పాత్రను పోషిస్తోందిట. పాత్ర కాస్త ఫన్నీగా సాగుతుందని సమాచారం.
అలాగే శర్వానంద్-సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్న `మహా సముద్రంలో` అను ఇమ్మాన్యుయేల్ కూడా లాయర్ పాత్రలోనే కనిపించనుందిట. సినిమాలో ఆ పాత్ర చాలా కీలకమని యూనిట్ చెబుతోంది. అనూ కెరీర్ లో ఇప్పటివరకూ చేయని ఛాలెంజింగ్ రోల్ ఇది. తనలోని సిసలైన నటిని బయటకు తెచ్చే పాత్ర ఇదని యూనిట్ భావిస్తోంది. ఈ పాత్ర చాలా సీరియస్ గానే సాగుతుందిట. మరి ఇద్దరు భామలు నల్లకోటు ధరించి ఏ రేంజ్ లో దూకుడు చూపిస్తారో చూద్దాం.