Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : చూపులతో వల వేస్తున్న శ్రీవల్లి..!

By:  Tupaki Desk   |   31 Oct 2022 6:32 AM GMT
ఫోటో స్టోరీ : చూపులతో వల వేస్తున్న శ్రీవల్లి..!
X
కిరాక్ పార్టీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిన కన్నడ భామ రష్మిక మందన్న తెలుగులో రెండు సినిమాలు చేసిందో లేదో అమ్మడి టాలెంట్ గుర్తించి స్టార్ క్రేజ్ ఇచ్చేశారు. చేస్తున్న పాత్ర ఎలాంటిదైనా అందులో తన మార్క్ అభినయంతో మెప్పిస్తూ వస్తున్న రష్మిక తెలుగులో స్టార్ ఇమేజ్ ఏర్పరచుకుని ఇప్పుడు బాలీవుడ్ లో కూడా సత్తా చాటుతుంది.

అమితాబ్ తో చేసిన గుడ్ బై సినిమా రిలీజ్ అవగా ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేదు. సినిమాలో రష్మిక నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. బాలీవుడ్ లోనే సిద్ధార్థ్ మల్హోత్రాతో మిషన్ మజ్ఞు.. రణ్ బీర్ కపూర్ తో యానిమల్ మూవీస్ చేస్తుంది రష్మిక.

తెలుగులో పుష్ప 2 తో పాటుగా దళపతి విజయ్ వారసుడు లో నటిస్తుంది. ఈ సినిమాలతో పాటుగా మరో రెండు తెలుగు ప్రాజెక్ట్ లలో కూడా రష్మిక డిస్కషన్స్ లో ఉందని టాక్. సినిమాకు 2 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్న అమ్మడు వాటితో పాటుగా సోషల్ మీడియా ఫోటో షూట్స్ తో కూడా అలరిస్తుంది.

ఎప్పుడూ ట్రెండీ వేర్ తో కనిపించే రష్మిక లేటెస్ట్ గా శారీ లుక్స్ తో అదుర్స్ అనిపించింది. గ్లామర్ షో కన్నా చూపులతో మత్తెక్కించే అందం తన సొంతమని హింట్ ఇస్తుంది రష్మిక. సినిమాల్లో తన నటనతో ఆకట్టుకుంటూ వస్తున్న ఈ భామ ఫోటో షూట్స్ తో కూడా స్పెషల్ క్రేజ్ ఏర్పరచుకుంటుంది. అందుకే ఇన్ స్టాగ్రాం లో 35 మిలియన్ల ఫాలోవర్స్ దగ్గరలో ఉంది రష్మిక.

సినిమాల్లో పాత్ర వరకే స్కిన్ షో చేయాల్సి ఉండగా ఫోటో షూట్స్ తో మాత్రం ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది అమ్మడు. అయితే లేటెస్ట్ గా రష్మిమ శారీ లుక్స్ మాత్రం కుర్రాళ్లని కట్టిపడేసేలా చేస్తుంది. గ్లామర్ షో చేస్తేనే కాని ఇలా తన కళ్లతో ఆడియన్స్ ని క్లీన్ బౌల్డ్ చేస్తుంది రష్మిక.

అందుకే అమ్మడు నేషనల్ క్రష్ అయ్యింది. ఇదే ఫాం కొనసాగిస్తే మరో దశాబ్ధ కాలం పాటు రష్మికకి తిరుగు ఉండదని చెప్పొచ్చు. రాబోతున్న సినిమాలు కూడా ఆమె ఇమేజ్ ని పెంచేలా ఉన్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా నేషనల్ ఆడియన్స్ అంతా రష్మిక తన సందడితో అదరగొట్టబోతుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.