Begin typing your search above and press return to search.

అమ్మ బాలయ్యో.. ఏందా స్టంట్లు??

By:  Tupaki Desk   |   6 Aug 2017 8:47 AM GMT
అమ్మ బాలయ్యో.. ఏందా స్టంట్లు??
X
ఆ మధ్యన పోర్చుగల్ దేశంలో నందమూరి బాలకృష్ణ చేసిన ఒక స్టంట్ గురించి చెప్పుకున్నాం. అయితే ఈ స్టంట్ చేసేటప్పుడు పక్క సీట్లో కూర్చున్న శ్రీయ తెగ భయపడిందని కూడా న్యూస్ వచ్చింది. ఇప్పుడు ఆ స్టంట్ వీడియోను రిలీజ్ చేశాడు పూరి జగన్. పదండి ఓ లుక్కేద్దాం.

పోర్చుగల్ లో ఒక క్యాబ్ కారులో బాలయ్య డ్రైవింగు సీట్లో పక్కనే శ్రీయ మరో సీట్లో ఉండటం మనం చూడొచ్చు. ఈ సినిమాలో బాలయ్య ఒక గ్యాంగస్టర్ గా చేస్తున్నారని తెలుసుకాని.. మరీ తన స్టంట్లన్నీ తనే చేసుకుంటారని అనుకోం. కాని బాలయ్య మాత్రం కారును డ్రిఫ్టింగ్ చేసే సీక్వెన్స్ ను ఆయనే చేసేశారట. కారు ఫ్రంట్ టైర్లను తిరగకుండా ఆపేసి ఫుల్లుగా ఫ్లాట్ గా కారును రోడ్డుపై దేకేలా చేయడమే డ్రిఫ్టింగ్ అంటే. అలాంటి డ్రిఫ్ట్ ఏదో టర్నింగుల్లో కాకుండా ఏకంగా పూర్తిగా 360 డిగ్రీలు తిప్పుతూ పిచ్చెక్కించాడు బాలయ్య. పక్కన శ్రీయ కాదు.. ఆ సీట్లో ఎవరు కూర్చున్నా కూడా నడిపేవాడి దాటిని చూసి గింగిరాలు తినేయాల్సిందే. పాపం శ్రీయ.. అలా దొరికిపోయింది.

కాని ఏదేమైనా బాలయ్య స్వయంగా తన స్టంట్లను తానే చేయడం వినడానికి బాగానే ఉంది కాని.. ఇప్పుడు ఇలా చూస్తే మాత్రం ఆయన రిస్క్ చేయడం మంచిది కాదని అనిపిస్తోంది. అభిమానులు కూడా రిస్క్ వద్దనే చెబుతున్నారు.