Begin typing your search above and press return to search.

మ‌హేష్ తో 'గ్లోబ్ ట్రాటింగ్ అడ్వంచ‌రస్' అంటే ఇలా!

By:  Tupaki Desk   |   30 Nov 2022 5:30 AM GMT
మ‌హేష్ తో గ్లోబ్ ట్రాటింగ్ అడ్వంచ‌రస్ అంటే ఇలా!
X
ఎస్ ఎస్ ఎంబీ 29వ చిత్రం పాన్ ఇండియా అని ఇప్ప‌టికే క‌న్ప‌మ్ అయింది. కానీ దేశం గ‌ర్వించదగ్గ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి అంత‌కు మించి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. జ‌క్క‌న్న అమెరికా వెళ్లిన నాటి నుంచి తిరిగొచ్చే వ‌ర‌కూ మ‌హేష్ సినిమా గురించి చ‌ర్చ సాగుతూనే ఉంది. హాలీవుడ్ దిగ్గ‌జాల‌తో మ‌హేష్ సినిమా గురించి డిస్క‌ష‌న్స్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

విజువ‌ల్ ట్రీట్' బాహుబ‌లి' సినిమాతో జ‌క్క‌న్న త‌న‌లో ఓ ర‌క‌మైన భావాన్ని బ‌య‌ట‌పెట్ట‌గిలిగారు. అటుపై 'ఆర్ ఆర్ ఆర్' సినిమాతో మ‌రో ర‌క‌మైన ఆలోచ‌నా విధానాన్ని వెండి తెర‌పై ఆవిష్క‌రించి షెభాష్ అనిపించుకున్నారు. ఇంకా ఆయ‌న మ‌న‌సులో సాధించాల్సింది చాలా ఉంద‌ని బ‌ల‌మైన కోర్కెలున్నాయి. అందులో ఒక‌టి మ‌హేష్ ని హాలీవుడ్ రేంజ్ లో ఎలివేట్ చేయ‌డం.

అందుకే ఈ సినిమా గురించి అంత‌ర్జాతీయ స్థాయిలో ప్రారంభానికి ముందే ప్ర‌మోట్ చేస్తున్నారు. సాహ‌సో పేత‌మైన క‌థ‌లో మ‌హేష్ క‌నిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి? అంటూ అంచ‌నాలు అంత‌కంత‌కు పెంచేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇండియానా జోన్స్ సిరీస్ లాంటి సినిమాచేయాల‌ని ఉంద‌ని....మ‌హేష్ తో అలాంటి సినిమానే చేస్తున్న‌ట్లు రివీల్ చేసారు.

అందుకే గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచ‌ర‌స్ గా ఈ సినిమా తీర్చి దిద్దుతున్న‌ట్లు తెలిపారు. మ‌రి ఈ గ్లోబ్ అడ్వంచ‌ర‌స్ అంటే? ఏంటో ఓసారి చూద్దాం. గ్లోబ్ ట్రాటింగ్ అనే పదానికి అర్థం 'వెతకటం దగ్గర నుంచి' చాలా దూర‌మైన ప్ర‌యాణం అనే అర్ధాలు ఉన్నాయి. యూనివర్సల్ కాప్ అంటే లీగల్ గా.. ఎథికల్ గా ఓ సర్టైన్ కేసు కోసం ప్రపంచదేశాలకు తిరగాల్సి వచ్చే పోలీస్. 'సింగం -3' సినిమా చూస్తే... ఓ కేసు కోసం సూర్య ఆస్ట్రేలియా వెళ్తాడు.

అక్కడ ఎయిర్ పోర్ట్ అథారిటీ అఫీషియల్స్ సూర్యను ఆపే ప్రయత్నం చేస్తారు. ఆ సీన్ గుర్తుంది కదా! ఇలా ఏదైనా ఓ కేసు కోసం విదేశాల్లో తిరిగే హీరో స్టోరీ అయ్యుండొచ్చు. మహేష్ 'పోకిరి'ని మాస్ ఫారిన్ కంట్రీస్ లో చేస్తే ఆ క‌థ‌లానే క‌నిపిస్తుంది. ఇక జేమ్స్ బాండ్ గురించి.. జేమ్స్ బాండ్ సినిమాల కథల గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఓ దేశాన్ని లేదా ఓ పర్టిక్యులర్ అథారిటీని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. కానీ అదంతా అండర్ కవర్ ఆప‌రేష‌న్. ఇదే రేంజ్ లో మ‌హేష్ ని ఓ సారి ఊహించుకోండి. ఇండియన్ జేమ్స్ బాండ్ లా మహేష్ పిచ్చెక్కిస్తాడు. పోష్ కార్లు.. ఆ లొకేషన్లు.. అల్టిమేట్ అండ్ అడ్వాన్స్డ్ గన్స్ అండ్ వగైరా! ఈసీన్స్ ఆన్ స్ర్కీన్ పై మామూలుగా ఉంటాయా? అయితే ఆప్రిక‌న్ అడ‌వుల నేప‌థ్య‌మ‌ని చిత్ర ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో అక్క‌డ మొద‌లైన క‌థ‌ని ఎలాంటి ట‌ర్నింగ్ తిప్పుతారు? అన్న‌ది స‌స్పెన్స్.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.