Begin typing your search above and press return to search.

దర్శకులు - నిర్మాతలతో ఆడుకుంటున్న హీరో

By:  Tupaki Desk   |   1 Sep 2019 8:32 AM GMT
దర్శకులు - నిర్మాతలతో ఆడుకుంటున్న హీరో
X
ఇప్పటికే ఇద్దరు ముగ్గురు హీరోయిన్లతో ప్రేమ, పెళ్లి వరకు వెళ్లి వాళ్లను వదిలేసిన హీరో అతడు. పాపం అప్పుడే కెరీర్ లో ఎదుగుతున్న నయనతారను ప్రేమ ముగ్గులో దించి ఆమెను తర్వాత వదిలేసి డిప్రెషన్ లోకి పంపిన ఘనుడు తమిళ హీరో ‘శింబు’ అని కథలు కథలుగా చెబుతారు.. అలాంటి హీరో రసికత గురించి ఎంత చెప్పినా తక్కువే.

అయితే ఈ హీరోయిన్లతో ఆడుకుంటే ఫర్వాలేదు.. కానీ ఇప్పుడు దర్శకులు - నిర్మాతలతోనూ ఇదేవిధంగా ఆడుకుంటున్నారు. వారికి విసుగు పుట్టిస్తున్నాడు. షూటింగ్ లకు హాజరుకాకుండా చెప్పిన పని చేయకుండా నిర్మాతల డబ్బును వేస్ట్ చేస్తూ దర్శకులకు పరీక్ష పెడుతున్నాడు. దీంతో శింబుపై వరుసగా తమిళ సినిమా పరిశ్రమ నిషేధం విధించేందుకు అప్పట్లో రెడీ అయ్యింది. అయితే అప్పుడు వదిలేశారు..

ప్రముఖ తమిళనిర్మాత జ్ఞానవేల్ రాజా తాజాగా శింబుతో సినిమాకు సాహసం చేశారు. ఫారిన్ షెడ్యూల్ ప్లాన్ చేశాడట.. ఫారిన్ కు వచ్చాక శింబు వేకేషన్ కు వెళ్లిపోవడంతో షూటింగ్ ఆగిపోయింది. తాను ఇన్ని గంటలే పనిచేస్తానని శింబు కండీషన్లు పెట్టాడట.. దీంతో తనకు నష్టం వాటిల్లుతోందని నిర్మాత జ్ఞానవేల్ తాజాగా తమిళ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశాడు. దీంతో శింబు భవితవ్యం తేల్చేందుకు నిర్మాతలంతా కంకణం కట్టుకున్నారు. అతడితో సినిమాలు తీయవద్దని నిషేధం విధించేందుకు రెడీ అయ్యారట..

ఇక ఇలానే విసిగించిన శింబుతో ఓ నిర్మాత సినిమాను మధ్యలోనే వదిలేయగా.. శింబునే దాన్ని డైరెక్ట్ చేసి రిలీజ్ చేశాడు. ఇక మరో నిర్మాత కూడా అష్టకష్టాలు పడి శింబుతో సినిమాను పూర్తి చేశాడు. ఇప్పుడు శింబుతో సినిమా అంటేనే తమిళ నిర్మాతలు హడలిచస్తున్నారట..