Begin typing your search above and press return to search.
తెలుగు హీరోలతో పోల్చి వాళ్ల గాలి తీశాడు
By: Tupaki Desk | 25 April 2018 5:12 AM GMTతమిళ సినిమాల్ని.. అక్కడి హీరోల్ని ఉదాహరణగా చూపించి.. మన సినిమాల్ని,మన హీరోల్ని విమర్శించడం ఎప్పట్నుంచో ఉన్నదే. కానీ ఈ మధ్య సీన్ రివర్సవుతోంది. మన దగ్గరే విభిన్నమైన.. గొప్ప గొప్ప సినిమాలొస్తున్నాయి. దీంతో ఇప్పుడు తమిళ సినిమాలపై జనాలకు గురి తగ్గిపోతోంది. అక్కడి సీనియర్లు మన సినిమాల్ని చూసి నేర్చుకోమని తమ వాళ్లకు సలహాలిచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ప్రముఖ తమిళ నిర్మాత.. సూర్య కజిన్ జ్ఞానవేల్ రాజా ఇదే తరహాలో మాట్లాడాడు. తమిళ హీరోల్ని ఉద్దేశించి అతను సంచలన వ్యాఖ్యలు చేశాడు. తమిళ హీరోలు చాలా స్వార్థపరులని.. వాళ్లు తెలుగు హీరోల్ని చూసి చాలా నేర్చకోవాలని జ్ఞానవేల్ చురకలు అంటించడం విశేషం. అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ చిత్రాన్ని తమిళంలోకి అనువాదం చేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన ప్రెస్ మీట్లో జ్ఞానవేల్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
‘‘సునాయాసంగా100 కోట్ల వసూళ్లు రాబట్టగలిగే సామర్ధ్యం ఉన్న తెలుగు హీరోలు సినిమాకు పారితోషికంగా కేవలం 15 కోట్లు తీసుకుంటారు. తెలుగు హీరోలు నిజాయతీగా.. ఒద్దికగా ఉంటారు. కానీ తమిళ హీరోలు అలా కాదు. ఒక్కో సినిమాకు వాళ్లు రూ.50 కోట్లు తీసుకుంటారు. తమిళ హీరోలంతా స్వార్థపరులు. ఈ విషయంలో వారు టాలీవుడ్ హీరోలని చూసి చాలా నేర్చుకోవాలి. ఉత్తరాది రాష్ట్రాల్లో తెలుగు సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. కానీ కోలీవుడ్ కు లేదు. తెలుగు సినిమాలు చూడటానికి చాలా రిచ్ గా ఉంటాయి. అందుకే అన్ని చోట్లా బాగా ఆడుతున్నాయి. కానీ కోలీవుడ్‌కు ఆ రిచ్ నెస్ లేదు కాబట్టే గుర్తింపు రాలేదు’’ అంటూ వ్యాఖ్యానించి ఆశ్చర్యపరిచాడు జ్ఞానవేల్. ఇటీవలే జ్ఞానవేల్ భార్య నేహ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కొందరు హీరోయిన్లు పచ్చని సంసారాలను కూలుస్తున్నారని.. వారి పేర్లను త్వరలో బయటపెడతానని హెచ్చరించడం సంచలనం రేపగా.. ఇప్పుడు జ్ఞానవేల్ చేసిన వ్యాఖ్యలు ఇంకా పెద్ద దుమారం రేపేలా ఉన్నాయి.