Begin typing your search above and press return to search.

వ‌యసు దాచేసినా దాగుతుందా అమ్మ‌డు?

By:  Tupaki Desk   |   6 Jun 2022 7:38 AM GMT
వ‌యసు దాచేసినా దాగుతుందా అమ్మ‌డు?
X
గోవా బ్యూటీ ఇలియానా ఇప్ప‌టికే ఫాం ని కోల్పోయింది. స‌క్సెస్ ఫాం కోసం తిరిగి ప్ర‌య‌త్నాలు చేస్తుంది గానీ ఫ‌లించ‌డం లేదు. ప్రేమ వైఫ‌ల్యం త‌ర్వాత అమ్మ‌డు మ‌ళ్లీ ల‌వ్ ..గివ్వు అన‌కుండా కెరీర్ పైనే శ్ర‌ద్ద పెట్టి ముందుకెళ్తుంది. కానీ ఆ క్షణాలు రావ‌డం అంత వీజీ కాదుగా. స‌క్సెస్ ..పెయిల్యూర్స్ ఎవ‌రికైనా స‌హ‌జం.

కొన్ని ప‌రాజ‌యాల త‌ర్వాతే ఒక విజ‌యం ద‌క్కుతుంది. ప్ర‌స్తుతం ఇలియానా అదే ఫేజ్ లో ఉంది. ఒక‌ప్పుడు ఓ వెలుగు వెలిగిన అమ్మ‌డు ఇప్పుడు పూర్తిగా చ‌ర‌మాంకానికి దగ్గ‌ర్లో ఉంది. ఈ క్ర‌మంలోనూ మునుపటి ఛ‌రిష్మాని అందుకోవాల‌ని ప్ర‌య‌త్నం లోపం లేకుండా చేస్తూనే ఉంది. ఈ క్ర‌మంలో ఎంతో స్లిమ్ గా మారింది. ఆ మ‌ధ్య ఒళ్లు చేసిన‌ట్లు క‌నిపించ‌డంతో మ‌ళ్లీ అన్నింటిని త‌న అధీనంలోకి తెచ్చుకునే ప్ర‌య‌త్నం చేసింది.

కొంత వ‌ర‌కూ స‌న్న‌బ‌డింది. కానీ వ‌య‌సు అనేది ఒక‌టుటుందిగా? అదీ ఏదో రూపేణా బ‌య‌ట‌ప‌డుతూనే ఉంటుంది. ఎంత మ్యాక‌ప్ తో..అద్దేసినా అస‌లు రూపం ఎక్క‌డో..ఓ ద‌గ్గ‌ర చిక్కుతుంది. స‌రిగ్గా మ‌రోసారి అలాగే చిక్కింది ఇల్లూ బేబి. అమ్మడి కొత్త ఫోటో ఒక‌టి ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. నేరుడు పండు డిజైన‌ర్ దుస్తుల్లో ఇలియానా ఇలా స్మార్ట్ ఫోన్ తో క్యామ్ కి ఫోజులిచ్చింది.

ఇలియానా ఎత్తుకు త‌గ్గ డిజైన‌ర్ ప్లోర‌ల్ డ్రెస్ లో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుంది. డ్రెస్ మ్యాచింగ్ లిప్ స్టిక్ అంతే ఫోక‌స్ అవుతుంది. ఎంపిక చేసుకున్న యాక్స‌ర‌సీస్ అన్ని ప‌ర్పెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. కానీ ఇలియానా ముఖంలో వ‌య‌సుతో వ‌చ్చిన మార్పు మాత్రం స్ప‌ష్టంగా గ‌మ‌నించ వ‌చ్చు. ఫేస్ లో మునుప‌టి గ్లో నెస్ లేదు. ఎన‌ర్జీ ముఖంలో కొర‌వ‌డింది.

రూప లావ‌ణ్యంలోనూ ఎన్నో మార్పులు క‌నిపిస్తున్నాయి. ఇలియానా వ‌య‌సిప్పుడు 35. కానీ ఈ ఫోటోలో అంత‌కు మించి వ‌య‌స్కురాలిగా కనిపిస్తుంది. 35 వ‌య‌సులో చాలా మంది హీరోయిన్ల‌గా కొన‌సాగుతున్నారు. కానీ ఆ వ‌య‌సుని కొంత మంది దాచేయ‌డంలో ప‌ర్పెక్ట్ ఎగ్జిక్యూష‌న్ తో ముందుకెళ్లి స‌క్సెస్ అవుతున్నారు.

ఇలియానా ఎగ్జిక్యూష‌న్ లో మాత్రం ఎక్క‌డో లోపాలున్నాయ‌ని అర్ధ‌మ‌వుతుంది. ఇక్క‌డో మ‌రో హీరోయిన్ ని ఉద‌హ‌రిస్తే.. ఇలియానా-అనుష్క క‌న్నా ఐదేళ్లు చిన్న‌ది. కానీ ఇద్ద‌ర్ని పోలిస్తే అనుష్క చిన్న‌దా? అని సందేహం రాక మాన‌దు. వ‌య‌సు దాచ‌డంలో ఎత్తు కొంత వ‌ర‌కూ అడ్డంకిగా మారే అవ‌కాశం ఉంటుంది. అనుష్క మాత్రం ఆ ఎత్తుని కూడా బ్యాలెన్స్ చేస్తూ ప‌క్కాగా మెయింటెన్ చేస్తుంది. కానీ ఇలియానాలో ఇవ‌న్నీ ఎక్క‌డో మిస్ ఫైర్ అయితున్నాయి.