Begin typing your search above and press return to search.
రాంగ్ టైమ్ లో గోవా బ్యూటీ కొత్త బిజినెస్
By: Tupaki Desk | 15 May 2021 12:30 PM GMTఫేడవుట్ అయిపోయిన చాలామంది కథానాయికలు ఆ తర్వాత రకరకాల వ్యాపారాలు ప్రారంభించి ఉపాధి బండి నడిపించేస్తున్న సంగతి తెలిసిందే. కొందరు సక్సెస్ సాధించి ముందుకు వెళితే చాలామంది బిచాణా సర్ధేసిన సందర్భాలున్నాయి.
ఇప్పుడు ఇదే బాటలో గోవా బ్యూటీ ఇలియానా కూడా పయనించనుందా? అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఇలియానా కెరీర్ ఆశించినంత గా లేదు. పైగా బోయ్ ఫ్రెండ్ నుంచి విడిపోవడం తనని తీవ్ర ఆవేదనకు గురి చేసింది. అన్నిటినీ మరిచి తిరిగి కెరీర్ ని రీవ్యాంప్ చేయలేకపోతోంది. అందుకే ఇక వేరే వ్యాపారాలపైనా దృష్టి సారిస్తోందట. ఈ బ్యూటీ తొందర్లోనే స్వీట్స్ అండ్ బేకరీ చెయిన్ బిజినెస్ ప్రారంభించనుందని తెలిసింది. తాజాగా ఇల్లీ చాక్లెట్ కేక్ తయారు చేసి దాని రెసిపీని ట్విట్టర్ లో పంచుకుంది. ఆమెకు చాలా లైక్ లు వ్యాఖ్యలు వచ్చాయి. ప్రస్తుత లాక్ డౌన్ ముగిసిన తర్వాత రెస్టారెంట్లు బేకరీల గొలుసును ప్రారంభించాలనే ఆలోచనతోనే ఇలా ఇంట్రో ఇచ్చింది. తన పేరుతోనే ఈ బేకరి బ్రాండ్ ను ప్రారంభిస్తుందట.
ఇప్పటికే ఇలియానా పేరుతో డిజైనర్ గార్మెంట్స్ బోటిక్ ఉంది. ముంబై హైదరాబాద్ లో దీనికి శాఖలు ఉన్నాయి. ఇప్పుడు బేకరీ వ్యాపారాన్ని విజయవంతం చేయాలన్నది ప్లాన్. కానీ ఇప్పుడున్న కోవిడ్ సన్నివేశంలో ఈ వ్యాపారం ఎంతవరకూ సక్సెసవుతుంది? అన్నది చెప్పలేం. దేనికైనా కోవిడ్ అంతమైతేనే సొల్యూషన్ లభిస్తుంది. అప్పటివరకూ ఇలియానా వేచి చూడాల్సి ఉంటుంది.