Begin typing your search above and press return to search.

గోవా.. చైనా.. పుష్ప చాలా బ్యాలన్స్ ఉంది

By:  Tupaki Desk   |   28 Jun 2021 7:30 AM GMT
గోవా.. చైనా.. పుష్ప చాలా బ్యాలన్స్ ఉంది
X
అల్లు అర్జున్‌ మోస్ట్‌ వెయిటెడ్‌ మూవీ పుష్ప షూటింగ్‌ పునః ప్రారంభంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వారం లోనే పుష్ప కొత్త షెడ్యూల్‌ కు వెళ్లబోతున్నట్లుగా మేకర్స్‌ చెబుతున్నారు. జులై మొదటి వారంలో ప్రారంభం కాబోతున్న హైదరాబాద్‌ షెడ్యూల్‌ ను రెండు నుండి మూడు వారాల పాటు నిర్వహిస్తున్నారు. ఆ షెడ్యూల్‌ లో కీలకమైన సన్నివేశాలు మరియు పాట చిత్రీకరణ జరుపబోతున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తి అయ్యింది. హైదరాబాద్‌ తర్వాత గోవాలో వారం నుండి పది రోజుల పాటు చిత్రీకరణ జరుపబోతున్నారు. ఇక చివరగా రెండు వారాల షెడ్యూల్‌ కోసం వీలు అయితే చైనాకు లేదంటే థాయిలాండ్‌ కు వెళ్లాలని సుకుమార్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

పుష్ప యాక్షన్‌ సన్నివేశాలు కేజీఎఫ్‌ యాక్షన్‌ సన్నివేశాలను మించి ఉంటాయంటూ మేకర్స్‌ చాలా నమ్మకంగా చెబుతున్నారు. అంతటి ప్రతిష్టాత్మక యాక్షన్‌ సన్నివేశాలు సింపుల్‌ గా తీస్తే ఎలా అందుకే అద్బుత లొకేషన్స్‌ ఉండే విదేశాల్లో ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ విషయమై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్‌.. గోవా.. చైనా షెడ్యూల్స్‌ తో సినిమా పూర్తి అవుతుంది. యూనిట్‌ సభ్యులు చెబుతున్న ఈ షెడ్యూల్స్ ను చూస్తుంటే ఇంకా చాలా బ్యాలన్స్ ఉన్నట్లుగా అనిపిస్తుందని మీడియా వర్గాల వారు అంటున్నారు.

తాజా ఈ షూటింగ్‌ రీ షెడ్యూల్‌ ను బట్టి చూస్తుంటే ఆగస్టులో సినిమా విడుదల అవ్వడం సాధ్యమేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఆగస్టు లో విడుదల చేయాలనుకున్న పుష్ప సినిమా ను కరోనా సెకండ్‌ వేవ్‌ అడ్డుకున్నట్లే అనిపిస్తుందని.. కొత్త విడుదల తేదీ రావాల్సిందేనమో అంటున్నారు. పుష్ప రెండు పార్ట్‌ లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొదటిది ఈ ఏడాదిలో వస్తే రెండవ పుష్ప 2023 లో వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయని ఆశిద్దాం.