Begin typing your search above and press return to search.

చెత్తపని చేసి అరెస్టు అయిన పూనమ్ పాండే

By:  Tupaki Desk   |   5 Nov 2020 4:00 PM GMT
చెత్తపని చేసి అరెస్టు అయిన పూనమ్ పాండే
X
వివాదాలకు.. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ తరచూ వార్తల్లోకి ఎక్కే బాలీవుడ్ సెక్స్ బాంబ్ పూనమ్ పాండే ను తాజాగా గోవా పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో తాను పోస్టు చేసే ఫోటోలు.. వీడియోలతో వేడి పుట్టించే పూనమ్.. ఇటీవల పెళ్లి చేసుకోవటం తెలిసిందే. పెళ్లి చేసుకున్న వారం వ్యవధిలోనే భర్త తనపై చేయి చేసుకున్నాడంటూ ఆరోపిస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేయటం.. అతగాడిని అరెస్టు చేయటం అప్పట్లో సంచలనమైంది. తర్వాత ఇరువురి మధ్య రాజీతో అతగాడిని పోలీసులు విడుదల చేశారు.
ఆశ్చర్యకరంగా వారిద్దరూ ఆ తర్వాత కలిసి ఉండటం విశేషం. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక అశ్లీల వీడియోనుషూట్ చేసిన నేరంపై ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. పాండేపై అశ్లీల వీడియోను షూట్ చేసిన మరో వ్యక్తి పైనా కేసు నమోదైంది. అయితే.. అతగాడి వివరాలు బయటకు రాలేదు.

గోవా కల్చర్ ను దెబ్బ తీసేలా.. చపోలీ డ్యామ్ పవిత్రను దెబ్బ తీసినందుకు కేసు పెట్టినట్లుగా పోలీసులు చెబుతున్నారు. పూనమ్ అశ్లీల వీడియో వ్యవహారంపై ఫార్వర్డ్ పార్టీ మహిళా విభాగం కంప్లైంట్ చేసింది. దీంతో స్పందించిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. మరింకేం పనులు లేనట్లు.. ఈ చెత్త పనులు చేయటం ఏమిటి పూనం?