Begin typing your search above and press return to search.
గోవారాజుగారి పెళ్లి పిలుపు
By: Tupaki Desk | 15 April 2016 4:52 AM GMTదుబాయ్ శీను గురించి విన్నాం. డల్లాస్ నాగేశ్వరరావు గురించీ తెలుసు. కానీ ఈ గోవారాజుగారు ఎవరంటారా? అదే విచిత్రం. ఆయనెవరు? ఆయన కథేంటన్న విషయాలు తెలియవు కానీ... ఆయన పెళ్లి ఆహ్వానం మాత్రం తెలుగు ఇండస్ట్రీకి అందింది. ఈ నెల 23న బంజారా హిల్స్ లో 10 గంటలకి ఫిక్స్ చేశారు. అందరూ ఆహ్వానితులే అన్నారు. వీలు చేసుకొని మీరొచ్చేయండైతే.
అన్నట్టు గోవారాజుగారు గోవాలాంటి మంచి ప్లేస్ ని వదులుకొని హైదరాబాద్ లో పెళ్లి చేసుకోవడమేంటో కదా! బహుశా అమ్మాయిది హైదరాబాద్ అయ్యుంటుంది! కానీ ఇక్కడ పెళ్లి కొడుకు అవతారంలో ఉన్న రాజుగారు మాత్రం మరీ ముదురుగా కనిపిస్తున్నారండీ. ఏ పరిస్థితుల వల్ల ఇంత లేటు వయసులో పెళ్లి చేసుకోవల్సి వచ్చిందోమరి! ఆ వివరాలన్నీ తెలియాలంటే మీరు నేరుగా పెళ్లి మంటపానికి వచ్చేయండంటున్నారు ఆ యూనిట్ వాళ్లు. యూనిట్ ఏంటి అంటారా? ఇదంతా సినిమా పెళ్లి వ్యవహారమండీ. థర్టీ ఇయర్స్ ఇక్కడ అంటూ అదరగొట్టే పృథ్వీ ఈసారి పెళ్లి కొడుకుగా మారి పెళ్లి పీటలెక్కాడు. మరి ముప్పయ్యేళ్లకి ఇండస్ట్రీకొచ్చి, ఇండస్ట్రీలోనే ముప్పయ్యేళ్లుగా గడుపుతున్న పృథ్వీలాంటి ముదురు బెండకాయ పెళ్లి వెనక ఎంత హంగామా ఉంటుందో తెలియాలంటే మీరంతా ఆ సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే!