Begin typing your search above and press return to search.
తెలుగు తెరపై గోదావరి సందడి గొప్పదే!
By: Tupaki Desk | 1 May 2022 11:30 PM GMTగోదావరి ఉరకలేస్తుంది .. పరుగులు తీస్తుంది. ఒక చోట గలగలమని ప్రవహిస్తే .. మరో చోట నిండుగా .. నిదానంగా ముందుకు సాగుతుంది. నా గోదావరి అంటూ గోదావరి నీటిని ప్రేమగా స్పర్శించిన కవులు ఎంతోమంది ఉన్నారు. తమ జీవితంలో గోదావరి ఒక భాగమైపోయిందని చెప్పుకున్నారు.
సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తొలి తరం వారి నుంచి నేటివరకూ వరకూ పరిశీలిస్తే, వాళ్లలో గోదావరి ప్రాంతంలోనివారే ఎక్కువగా కనిపిస్తారు. వాళ్లలో ఎవరి ప్రతిభా పాటవాల ప్రస్తావన వచ్చినా, అంతా ఆ గోదావరి నీళ్లలోనే ఉందని చెబుతుంటారు.
ఇప్పుడంటే ప్రతివాళ్లు పాట పట్టుకుని ఫారిన్ పరిగెడుతున్నారుగానీ, ఒకప్పుడు చాలా పాటలు గోదావరి నేపథ్యంలోనే పురుడు పోసుకున్నాయి. ఎన్నో సినిమా కథలు ఈ గోదావరి తీరంలోనే పుట్టిపెరిగాయి. 'గోదారి గట్టుంది ' .. 'ఉప్పొంగింది గోదావరి' .. 'గోదావరీ పై ఎద' .. 'గల గలల పారుతున్న గోదారిలా' .. ఎల్లువొచ్చి గోదారమ్మా' .. 'వయ్యారి గోదారమ్మ వలపుల్లో ఎందుకమ్మా కలవరం' .. ఇలా ఎన్నో పాటలు గోదావరి అలలపై అందంగా పుట్టినవే. తెలుగు కథకు అందమైన దృశ్యాలను .. ఆకట్టుకునే పాటలను ఇచ్చినది గోదావరే అనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.
గోదావరి జిల్లాల నుంచి వచ్చిన దర్శకులు .. తమ జీవితాలతో పెనవేసుకుపోయిన గోదావరిని మరిచిపోలేదు. తమ కథలలో గోదావరికి కూడా ఒక పాత్రను ఇచ్చారు. గోదావరి వయ్యారాలను .. తళతళలను తెరపై చూసుకుని మురిసిపోయారు.
ఒకప్పుడు తెలుగు సినిమా చిత్రీకరణ స్టూడియోలు దాటి బయటికి రాలేదు. అలాంటి సమయంలోనే 'మూగమనసులు' సినిమా షూటింగును గోదావరి తీరంలో జరిపారు. ఈ సినిమా దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుది రాజమండ్రి. అందువలన గోదావరికి కూడా ఆయన ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రను ఇచ్చారు.
ఇక 'బాపు' కూడా తన సినిమాల్లో గోదావరికి ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తూ వచ్చారు. అప్పట్లోనే ఆయన 'అందాలరాముడు' సినిమా మొత్తాన్ని కూడా గోదావరి నేపథ్యంలోనే తీశారు. ఒక కథ పడవ ప్రయాణంతో మొదలై గమ్యానికి చేరుకోవడంతో ముగియడం అనేది తెలుగులో ఈ సినిమాతోనే మొదలు. 'గోదావరి'పై పూర్తి స్థాయిలో సాగిన కథ ఇదే అని చెప్పాలి. ఇక 'ముత్యాల ముగ్గు' సినిమాలో ఆయన నాయిక వైపు నుంచి కన్నీటి గోదావరిని చూపించారు. నాయకుడి వైపు నుంచి భారంగా కదిలే గోదావరిని చూపించారు.
అలాగే కె. విశ్వనాథ్ గారి సినిమాల్లోను .. రాఘవేంద్రరావు సినిమాల్లోను గోదావరి చేసే సందళ్లు కనిపిస్తాయి .. వినిపిస్తాయి. గోదావరి లేకుండా సినిమా తీయడు అని చెప్పుకునే దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది సీనియర్ వంశీనే అని చెప్పాలి. ఆయన సినిమాల్లో గోదావరికి దక్కిన స్థానం ప్రత్యేకమనే చెప్పుకోవాలి.
ఆయన తెరకెక్కించిన చాలా సినిమాల్లోని పాత్రలు అక్కడే ఆడుకున్నాయి .. అక్కడే పాడుకున్నాయి. ఆయన తరువాత 'గోదావరి' అనే టైటిల్ తోనే సినిమా తీసిన శేఖర్ కమ్ముల, గోదావరితో ప్రేక్షకులకున్న బంధాన్ని మరింత పటిష్ఠం చేశారు. ఇలా చూసుకుంటే తెలుగు కథలతో .. తెలుగువారి మనసులతో గోదావరికి విడదీయరని అనుబంధం ఉందనే విషయం అర్థమైపోతుంది.