Begin typing your search above and press return to search.
గాడ్ ఫాదర్ 5 డేస్ కలెక్షన్స్.. ఎంత వచ్చాయంటే?
By: Tupaki Desk | 10 Oct 2022 6:31 AM GMTమెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా మొత్తానికి పాజిటివ్ టాక్ తో ఫస్ట్ వీకెండ్ మంచి కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంది. మోహన్ రాజా దర్శకత్వంలో తెరపైకి వచ్చిన ఈ మలయాళం రీమేక్ మూవీ తెలుగు ప్రేక్షకులకు ఎంత వరకు నచ్చుతుంది అనే విషయంలో మొదట చాలా రకాల అనుమానాలు అయితే వచ్చాయి. కానీ దర్శకుడు మెగాస్టార్ చిరంజీవిని ఒకవైపు ఫ్యాన్స్ కు నచ్చినట్టుగా చూపిస్తూనే మరొకవైపు అందులో ఉన్న అద్భుతమైన కథను కూడా చాలా చక్కగా ప్రజెంట్ చేశాడు.
ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంటుంది. మొదటి రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 12.7 కోట్లు అందుకుంది. ఇక ఆ తర్వాత రెండవ రోజు 7.73 కోట్లు, మూడవ రోజు 5.41 కోట్లు నాలుగవ రోజు 5.62 కోట్లు షేర్ కలెక్షన్స్ అందుకున్న గాడ్ ఫాదర్ ఐదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.23 కోట్లు అందుకున్నాడు.
ఇక మొత్తంగా ఈ ఐదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 36.96 కోట్లు సొంతం చేసుకుంది. ఇక గ్రాస్ 61.20 కోట్లు వచ్చాయి. కర్ణాటక లో 4.25 కోట్లు సొంతం చేసుకున్న ఈ సినిమా హిందీలో అలాగే మిగతా రాష్ట్రాల్లో 4.61 కోట్లు అందుకుంది. ఇక మొత్తంగా ఓవర్సీస్ లో అయితే 4.30 కోట్లు వచ్చినట్లు సమాచారం. గాడ్ ఫాదర్ ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 50.11 కోట్ల షేర్ కలెక్షన్స్ తో పాటు 91 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.
ఒక విధంగా ఫస్ట్ వీకెండ్ లో ఇవి మంచి నెంబర్స్ అయినప్పటికీ కూడా సోమవారం నుంచి సినిమాకు అసలైన పరీక్ష మొదలుకానుంది. ఎందుకంటే హాలిడేస్ ముగియడంతో జనాలు థియేటర్ల వైపు చూడడం చాలా తక్కువ. కాబట్టి సోమవారం కలెక్షన్స్ బట్టి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకుంటుందా లేదా అనేది అర్థమవుతుంది.
ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మొత్తంగా 91 కోట్ల వరకు బిజినెస్ అయితే చేసింది. సక్సెస్ కావాలి అంటే ఇంకా 41 కోట్ల షేర్ అందుకోవాల్సి ఉంటుంది. మరి మెగాస్టార్ చిరంజీవి సోమవారం నుంచి ఎలాంటి నెంబర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.