Begin typing your search above and press return to search.
గాడ్ ఫాదర్ క్లోజింగ్ కలెక్షన్స్.. నష్టాలు తప్పలేదుగా!
By: Tupaki Desk | 27 Oct 2022 2:36 AM GMTమెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటివారం మంచి కలెక్షన్స్ అందుకున్నప్పటికీ ఆ తర్వాత మళ్లీ కలెక్షన్స్ డౌన్ అయిపోయాయి. మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న లూసిఫర్ కథకు రీమేక్ గా తెరపైకి వచ్చిన ఈ సినిమాకు రివ్యూల పరంగా మంచి హిట్ టాక్ ను అందుకుంది. ఫ్యాన్స్ నుంచి అయితే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది.
అంతేకాకుండా హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా కొన్ని సన్నివేశాలకు ఫిదా అయ్యారు. అయితే పూర్తిస్థాయిలో మాత్రం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెట్టిన పెట్టబడిని వెనక్కి తేలేక పోయింది. ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా నటించినప్పటికీ హిందీలో కూడా ఆశ్చర్యపరిచే నెంబర్లను ఏమి క్రియేట్ చేయలేకపోయింది. ఇక బాక్సాఫీస్ వద్ద రెండు వారాల కంటే ఎక్కువ రోజులు కూడా నిలదుక్కుకోలేకపోయింది.
ఇక మూడో వారం తర్వాత దాదాపు అన్ని థియేటర్లలో కూడా ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు తీసేసారు. ముఖ్యంగా కాంతార సినిమా ప్రభావం కూడా ఈ సినిమాపై గట్టిగానే చూపించింది. ఇక మొత్తంగా మూడు వారాల్లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది క్లోజింగ్ కలెక్షన్స్ టోటల్ ఎంత అనే వివరాల్లోకి వెళితే.. ఏపీ తెలంగాణలో మొత్తంగా ఈ సినిమా అయితే 43.46 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకుంది.
ఇక కర్ణాటకలో 4.72 కోట్లు రాబట్టిన గాడ్ ఫాదర్ సినిమా హిందీలో అలాగే మిగతా రాష్ట్రాల్లో మొత్తంగా 5.20 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించింది. ఇక ఓవర్సీస్ లో చూసుకుంటే 5.20 కోట్లు మాత్రమే రాబట్టింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా గాడ్ ఫాదర్ సినిమా 58.58 కోట్ల షేర్ కలెక్షన్స్ తో అందుకుంది. దాదాపు ఇదే క్లోజింగ్ నెంబర్ అని తెలుస్తోంది.
మొత్తంగా ఈ సినిమా అయితే 74 కోట్ల వరకు బిజినెస్ అయితే చేసింది. ఇక బాక్సాఫీస్ వద్ద ఆ టార్గెట్ మాత్రం పూర్తి చేయలేకపోవడంతో మొత్తంగా కలుపుకొని 15 కోట్లతో నష్టాలు ఎదుర్కోబోతున్నట్లు తెలుస్తోంది. ఆచార్య సినిమాతో ఫాలొస్తే మెగాస్టార్ కు గాడ్ ఫాదర్ మంచి టాక్ ను అందించింది కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం పూర్తి స్థాయిలో లాభాలు అందుకోలేదు. మరి సంక్రాంతికి రాబోయే వాల్తేరు వీరయ్య ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.