Begin typing your search above and press return to search.

గాడ్‌ ఫాదర్ మార్నింగ్ షో.. ది ఘోస్ట్‌ మ్యాట్నీ షో.. స్వాతిముత్యం ఫస్ట్‌ షో

By:  Tupaki Desk   |   27 Sep 2022 4:56 AM GMT
గాడ్‌ ఫాదర్ మార్నింగ్ షో.. ది ఘోస్ట్‌ మ్యాట్నీ షో.. స్వాతిముత్యం ఫస్ట్‌ షో
X
దసరా కానుకగా మెగాస్టార్‌ చిరంజీవి గాడ్‌ ఫాదర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడు. అక్టోబర్‌ 5వ తారీకున రాబోతున్న గాడ్‌ ఫాదర్‌ సినిమాకు పోటీ అన్నట్లుగా నాగార్జున ది ఘోస్ట్‌ సినిమా కూడా అక్టోబర్‌ 5వ తారీకున విడుదల కాబోతుండటం చర్చనీయాంశంగా మారిన విషయం తెల్సిందే. రెండు సినిమాలు ఒకే రోజు విడుదల చేయడం ద్వారా రెండు సినిమాలకు నష్టమే అన్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ రెండు సినిమాల మధ్య పోటీ చాలదు అన్నట్లుగా సరిగ్గా అదే రోజు దసరా సందర్భంగా బెల్లంకొండ సాయి గణేష్ నటించిన మొదటి సినిమా స్వాతి ముత్యం ను విడుదల చేసేందుకు సిద్ధం అయ్యారు. రెండు పెద్ద సినిమాలు విడుదల అవుతున్న సమయంలో వాటితో పాటు ఒక కొత్త హీరో విడుదల చేయడం అనేది ఎంతటి సాహసమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

వారికి స్వాతిముత్యం పై ఉన్న నమ్మకంతో విడుదలకు సిద్ధం అయినట్లుగా తెలుస్తోంది. ఎంత నమ్మకం ఉన్నా కూడా ఇద్దరు టాలీవుడ్‌ స్టార్స్ తో రావడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ పలువురు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. చివరి నిమిషంలో అయినా స్వాతిముత్యం సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని చాలా మంది భావించారు.

స్వాతిముత్యం విడుదల ఆగేది లేదని తాజాగా ప్రెస్‌ మీట్‌ తో తేల్చి చెప్పారు. ఈ సినిమాను సీతార ఎంటర్‌ టైన్మెంట్స్ వారు విడుదల చేయబోతున్న నేపథ్యంలో విడుదల విషయంలో చివరి నిమిషం సమస్యలు ఉండే అవకాశం లేదు. తాజాగా ప్రమోషనల్‌ ప్రెస్ మీట్‌ లో భాగంగా చిత్రయూనిట్‌ సభ్యులు చిరంజీవి నాగార్జున సినిమాలతో పాటు మా సినిమాను కూడా జనాలు చూస్తారనే నమ్మకం వ్యక్తం చేశారు.

పోటీ విషయమై నిర్మాత నాగ వంశీ స్పందిస్తూ... స్వాతి ముత్యం మంచి ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్ కనుక దసరా టైమ్‌ కి తీసుకు వస్తున్నాం అన్నాడు. గాడ్ ఫాదర్‌ సినిమా ను మార్నింగ్‌ షో... ది ఘోస్ట్‌ సినిమాను మ్యాట్నీ షో చూసి ఫస్ట్‌ షో కి ప్రేక్షకులు స్వాతిముత్యం చూస్తారనే నమ్మకంను నిర్మాత నాగవంశీ వ్యక్తం చేశాడు. తమకు ఉన్న బలమైన డిస్ట్రిబ్యూషన్ టీమ్‌ తో సినిమా ను భారీ ఎత్తున విడుదల చేస్తున్నామని పేర్కొన్నాడు. మరి వీరి యొక్క నమ్మకం.. విశ్వాసం ఎంత వరకు నిలిచేనో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.