Begin typing your search above and press return to search.
గాడ్ ఫాదర్.. తడిసి ముద్దవుతున్నా మహేష్ కోసం..!
By: Tupaki Desk | 29 Sep 2022 4:04 AM GMTఓవైపు భారీ ఈవెంట్ జరుగుతోంది. మరోవైపు జోరున వర్షం కురుస్తోంది. రాయలసీమ నేల తడిసి ముద్దవుతోంది. కానీ ఆ వేదిక వద్ద నుంచి అభిమానులు కదల్లేదు. ఇక ఆ వేదిక పై ఉన్న అతిథులు కూడా కదల్లేదు. ఈవెంట్ ని ఆపలేదు. సరికదా ఈ వేదికపై ఉన్న మెగాస్టార్ చిరంజీవి అంత వర్షంలోనూ తడిసి ముద్దవుతూ కూడా సూపర్ స్టార్ కృష్ణ -మహేష్ బాబు కుటుంబానికి జరిగిన నష్టానికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ కృష్ణ సతీమణి.. మహేష్ తల్లిగారు ఇందిరాదేవి మృతికి సంతాపం తెలియజేసారు.
28 సెప్టెంబర్ బుధవారం నాడు తెల్లవారుజామున శ్రీమతి ఇందిరాదేవి దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. ఈ మృతి సినీపరిశ్రమను కలవరపరిచింది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా తన సంతాపాన్ని తెలియజేసి కృష్ణ- మహేష్ లకు బలం చేకూర్చాలని ఆకాంక్షించారు.
గాడ్‌ఫాదర్ ప్రీ-రిలీజ్ వేదికపైనా ఆయన తన మనసును చాటుకున్నారు. గాడ్ ఫాదర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుగుతుండగానే అక్కడ భారీ వర్షం కురిసింది. వేదికపై ఇతర సినీ ప్రముఖులతో కలిసి చిరంజీవి తడిసి ముద్దవుతూ కనిపించారు. ఓవైపు ఎమోషనల్ గా స్పీచ్ ఇస్తున్న దృశ్యం కనిపిస్తోంది.
ఓవైపు అభిమానులు గొడుగు పడుతున్నా దానిని విడిచిపెట్టి మరీ చిరు ఎంతో ఎమోషనల్ గా మాట్లాడారు. తాను అడుగుపెట్టిన ప్రతిసారీ రాయలసీమలో నేల తడుస్తుందని తనదైన శైలిలో చిరు వ్యాఖ్యానించారు. తన రాజకీయ ప్రచారంలోనూ .. అలాగే ఇంద్ర సినిమా సమయంలోనూ ఇలానే రాయలసీమలో అడుగుపెట్టగానే వర్షం కురిసిందని వరుణుడు కనికరించాడని కూడా చిరు ఎమోషనల్ అయ్యారు. సీమలో వర్షం లేక ప్రజలు ఎంతో ఇబ్బందిపడుతున్నారని కూడా గుర్తు చేసారు. వరుణుడికి మరోసారి ధన్యవాదాలు తెలిపారు.
ముఖ్యంగా కృష్ణ- మహేష్ కుటుంబానికి జరిగిన నష్టాన్ని ప్రస్థావిస్తూ.."ఈరోజు (బుధవారం) ఉదయం సూపర్ స్టార్ కృష్ణ గారి కుటుంబంలో ఆయన భార్య.. మహేష్ తల్లి ఇందిరాదేవి గారు మరణించడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. గాడ్ ఫాదర్ వేదికపై నుండి నేను వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నాను"అని అన్నారు.
నిజానికి కృష్ణ- మహేష్ కుటుంబంతో చిరుకు ఎంతో గొప్ప అనుబంధం ఉంది. సూపర్ స్టార్ కృష్ణ ప్రోద్భలంతోనే చిరు పరిశ్రమలో ఎదిగానని తెలిపారు. అలాగే కృష్ణ గారితో కలిసి చిరు సినిమాల్లో నటించారు. ఈ అనుబంధంపై మెగాస్టార్ వీలున్న ప్రతిసారీ వేదికలపై ఎమోషనల్ అవుతూనే ఉన్నారు. ఈ రోజు కూడా ఈ వేదికపై అది కనిపించింది. గాడ్ ఫాదర్ ఈవెంట్ వల్ల వెంటనే కృష్ణ-మహేష్ లను చిరు కలవలేకపోయారు.. అందుకు చాలా బాధపడ్డారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.