Begin typing your search above and press return to search.

గాడ్ ఫాద‌ర్.. త‌లైవి కోసం ఇన్ని మార్పులా?

By:  Tupaki Desk   |   6 Oct 2022 4:53 AM GMT
గాడ్ ఫాద‌ర్.. త‌లైవి కోసం ఇన్ని మార్పులా?
X
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌య‌న‌తార కీల‌క పాత్ర‌లో న‌టించిన గాడ్ ఫాద‌ర్ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ ద‌క్కించుకుంటున్న సంగ‌తి తెలిసిందే. విడుద‌లైన అన్నిచోట్లా పాజిటివ్ టాక్ తో ఈ మూవీ ర‌న్ అవుతోంది. ఆచార్య లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత బాస్ ఈజ్ బ్యాక్ అని నిరూపించారంటూ అభిమానుల్లో కోలాహాలం క‌నిపిస్తోంది.

అయితే ఈ సినిమా ఒరిజిన‌ల్ తో పోలిస్తే చాలా మార్పుల‌కు లోన‌వ్వ‌డం అభిమానుల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇది మ‌ల‌యాళ వెర్ష‌న్ లూసీఫ‌ర్ కి రీమేక్. కానీ ఇందులో చిరు ఇమేజ్ కి త‌గ్గ‌ట్టు న‌య‌న‌తార రేంజుకు త‌గ్గ‌ట్టు చాలా మార్పు చేర్పులు చోటు చేసుకున్నాయి.


దర్శకుడు మోహన్ రాజా ఇప్పటికే వివిధ ఇంటర్వ్యూలలో చెప్పినట్లుగా 'లూసిఫర్' ఒరిజినల్ స్క్రిప్ట్ లో అనేక మార్పులు చేసారు. ముఖ్యంగా ఒరిజినల్ లో నయనతార పోషించిన పాత్రకు మరో సోదరుడు ఉంటాడని ఆ పాత్రలో టోవినో థామస్ న‌టించ‌గా.. ఈ బ్రదర్ క్యారెక్టర్ చివర్లో ముఖ్యమంత్రి అవుతుంది.

అది కూడా చాలా కన్విన్సింగ్ గా అనిపించింది. అయితే ఇక్కడ గాడ్ ఫాదర్ లో సోదరుడి పాత్రను పూర్తిగా తొలగించారు. సినిమా చివరిలో నయనతార ముఖ్యమంత్రి అవుతుంది. న‌య‌న్ ఇమేజ్ కి త‌గ్గ‌ట్టు ఈ మార్పు చేసార‌ని భావించ‌వ‌చ్చు. కేవ‌లం న‌య‌న‌తార కోస‌మే ఇలాంటి మార్పు చేసారా? అన్న‌ది ఆశ్చర్యం క‌లిగించే విష‌య‌మే. అయితే న‌య‌న‌తార‌కు త‌మిళంలో త‌లైవి అన్న ఇమేజ్ ఉంది. దానికి త‌గ్గ‌ట్టు ఇంత హైప్ చేసార‌ని భావించాలి.

లూసీఫ‌ర్ లో మంజు వారియర్ (నయనతార పాత్ర‌) పోషించిన పాత్రకు మరణించిన భర్త నుండి ఒక కుమార్తె ఉంటుంది. వివేక్ ఒబెరాయ్ త‌న‌కు ప్రస్తుత భర్త.. సవతి తండ్రిగా క‌నిపిస్తాడు. త‌న భార్య‌ను దోపిడీ చేస్తాడు.

అయితే ఒబేరాయ్ పాత్ర గాడ్ ఫాద‌ర్ లో నయనతార సోదరిగా మారింది. తద్వారా ఒక ముఖ్యమైన భావోద్వేగ ఎలిమెంట్ ని తగ్గించారు. ఇలాంటి మార్పుల‌తో వ‌చ్చి గాడ్ ఫాద‌ర్ అంద‌రినీ మెప్పించ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. ఇదంతా మోహ‌న్ రాజా రైటింగ్ లో క్వాలిటీని ద‌ర్శ‌క‌త్వ ఎబిలిటీని ఆవిష్క‌రించింద‌ని చెప్పాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.