Begin typing your search above and press return to search.

గాడ్‌ ఫాదర్ విలన్‌ 'ఫుల్‌ బాటిల్‌'

By:  Tupaki Desk   |   1 Nov 2022 9:01 AM GMT
గాడ్‌ ఫాదర్ విలన్‌ ఫుల్‌ బాటిల్‌
X
హీరోగా వరుస సినిమాలు చేస్తూ సినిమా సినిమాకి నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకుంటున్న యంగ్‌ హీరో సత్యదేవ్‌. ఇటీవల ఈయన మెగాస్టార్ చిరంజీవి తో గాడ్‌ ఫాదర్ సినిమాలో నటించాడు. చిరంజీవి తో ఢీ కొట్టే సన్నివేశాల్లో సత్యదేవ్‌ నటించి మెప్పించాడు. అంతే కాకుండా బాలీవుడ్‌ లో కూడా స్టార్‌ హీరో సినిమాలో కీలక పాత్రలో సత్యదేవ్‌ నటించాడు.

ఒక వైపు స్టార్‌ హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రలను.. విలన్ రోల్స్ ను చేస్తూ ఉన్న సత్యదేవ్‌ మరో వైపు వరుసగా హీరోగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈయన నటించిన గుర్తుందా శీతాకాలం సినిమా విడుదలకు సిద్ధం అవుతున్న విషయం తెల్సిందే. ఈ సమయంలోనే మరో సినిమాను సత్యదేవ్‌ ప్రకటించాడు.

ఫుల్‌ బాటిల్‌ అనే విభిన్నమైన టైటిల్‌ తో సినిమా ను సత్యదేవ్‌ ప్రకటించాడు. సినిమాను ప్రకటించడం మాత్రమే కాకుండా టైటిల్ లోగోను కూడా సత్యదేవ్ విడుదల చేయడం జరిగింది.

ఈ సినిమాకు శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. విభిన్నమైన కాన్సెప్ట్‌ తో ఈ సినిమా ఉంటుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

టైటిల్ లోగోను కూడా బాటిల్‌ రూపంలో చూపించడం తో ఇది ఆల్కహాల్ కి సంబంధించిన కథ అయ్యి ఉంటుందని అనిపిస్తుంది.

అదే సమయంలో ఆటో లో ఇద్దరిని చూపించడం వల్ల ఇందులో అంతకు మించిన ఇంట్రెస్టింగ్ పాయింట్‌ ఏదో కూడా ఉండబోతుందని టైటిల్ లోగో ద్వారా చెప్పకనే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి సత్యదేవ్‌ మరో విభిన్నమైన సినిమా తో రాబోతున్నాడు అనిపిస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.