Begin typing your search above and press return to search.
కాలి బూడిదైన స్టార్ జ్ఞాపకాలు - కోట్ల నష్టం
By: Tupaki Desk | 1 May 2019 6:20 AM GMTబాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ కు చెందిన ధర్మప్రొడక్షన్ స్టూడియోలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరగడంతో పాటు, అంతకు విలువైన జ్ఞాపకాలు, వస్తువులు కూడా కాలి బూడిద అయినట్లుగా జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ద్వారా తెలుస్తోంది. ఏప్రిల్ 30వ తారీకున ధర్మ ప్రొడక్షన్స్ లో ప్రమాదం సంభవించింది - మొదటి ఫ్లోర్ లో మొదలైన మంటలు ఉవ్వెత్తున ఎగసి పెద్దవి అయ్యాయి. దాంతో ధర్మ ప్రొడక్షన్ కు సంబంధించిన మొత్తం భవనం అగ్నికి ఆహుతి అయ్యింది. ఈ అగ్ని ప్రమాదంలో షూటింగ్స్ కు వాడే ఎన్నో అత్యాధునిక పరికరాలు మరియు వేల సంఖ్యలో ఉన్న కాస్ట్యూమ్స్ మరియు ఎప్పటి నుండో జ్ఞాపకాలుగా భద్రపర్చుకుంటున్న కొన్ని వస్తువులు మరియు కాస్ట్యూమ్స్ కూడా ఈ ప్రమాదంలో తగులబడి పోయాయి.
1976వ సంవత్సరంలో కరణ్ జోహార్ తండ్రి అయిన యశ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ ను గోరేగావ్ ప్రాంతంలో ఉండే ఇండస్ట్రీయల్ పార్క్‌లో నిర్మించడం జరిగింది. 18 వేల చదురపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ధర్మ ప్రొడక్షన్స్ ఆఫీస్ లో పెద్ద ఎత్తున షూటింగ్ సామాగ్రి, ఈ సంస్థలో నిర్మాణం జరిగిన సినిమాలకు సంబంధించిన వస్తువులు మరియు కాస్ట్యూమ్స్ వంటివి ఉంటాయి. వందల సంఖ్యలో కొత్త దర్శకులు తయారు చేసిన స్క్రిప్ట్ లు మరియు కథలు కూడా ఉన్నాయట. అవన్ని కూడా తగులబడి పోయాయి.
తన తండ్రికి సంబంధించిన ఎన్నో జ్ఞాపకాలను కూడా కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ ఆఫీస్ లోనే భద్రపర్చడం జరిగిందట. అవి కూడా అగ్నికి ఆహుతి అవ్వడంతో కరణ్ జోహార్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశాడట. ఆస్తి నష్టం కంటే విలువ కట్టలేని వస్తువులు, జ్ఞాపకాలు కోల్పోవడంతో ధర్మ ప్రొడక్షన్స్ టీం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ధర్మ ప్రొడక్షన్స్ లో తెరకెక్కుతున్న సినిమాలకు సంబంధించి కూడా పలు వస్తువులు అగ్నికి ఆహుతి అయ్యాయి. దాంతో ఆ సినిమాలపై కూడా ప్రభావం పడుతుందనే టాక్ వినిపస్తుంది. ధర్మ ప్రొడక్షన్స్ లో అగ్ని ప్రమాదంకు ముందు ఆర్కే స్టూడియోలో కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే రోజు రెండు బాలీవుడ& నిర్మాణ సంస్థల్లో అగ్ని ప్రమాదం జరగడంతో బాలీవుడ్ వర్గాలు షాక్ లో ఉన్నాయి.