Begin typing your search above and press return to search.
మంత్రి కేటీఆర్ కు `గాడ్సే` డైరెక్టర్ రిక్వెస్ట్!
By: Tupaki Desk | 23 July 2022 3:40 PM GMTతెలంగాణ మత్రి, డైనమిక్ లీడర్‌గా యూత్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న కేటీఆర్ శనివారం స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాద వశాత్తు జారి పడటంతో ఆయన ఎడమ కాలు చీమండకు గాయం అయింది. దీంతో ట్రీట్మెంట్ తీసుకున్న కేటీఆర్ కు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారట.
జూలై 24న ఆయన పుట్టిన రోజు కావడం, ఒక రోజు ముందు ఆయనకు ప్రమాదం జరగడంతో ఆమన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
తనకు గాయం అయిన విషయాన్ని మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఎడమ కాలుకు పట్టీ వేసుకుని సోఫాలో కూర్చుని వున్న ఫొటోని షేర్ చేసిన ఆయన తనకు తగిలిన గాయం గురించి ట్వీట్ చేశారు. `ఈ రోజు ప్రమాద వశాత్తు జారిపడటంతో ఎడమకాలు చీలమండ వద్ద స్వల్పంగా ఫ్రాక్చర్ అయింది. మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ సమయంలో ఓటీటీలో మంచి కంటెంట్ వుంటే సూచించండి` అని ట్వీట్ చేశారు.
శనివారం ప్రగతిభవన్ లో కేటీఆర్ ప్రమాద వశాత్తు జారి కిండ పడటంతో ఆయనని హుటా హుటిన అధికారులు ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్ లో ప్రత్యేక చికిత్స అనంతరం కేటీఆర్ తిరిగి ప్రగతి భవన్ చేరుకున్నారు. అయితే 24న ఆయన పుట్టిన రోజు వేడుకలు జరగనున్న నేపథ్యంలో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే డాక్టర్లు మాత్రం కేటీఆర్ కాలి గాయం పట్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన సని లేదని, మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని సూచించారు.
కేటీఆర్ ట్వీట్ కు స్పందించిన దర్శకుడు గోపీగణేష్ తను రూపొందించిన `గాడ్సే` సినిమా చూడమని ట్వీట్ చేశారు. డైనమిక్ కేటీఆర్ సర్ త్వరగా మీరు కోలుకోవాలని కోరుకుంటున్నాను. దయచేసి నేను రూపొందించిన `గాడ్సే` మూవీని నెట్ ఫ్లిక్స్ లో వీక్షించండి. మన యూత్ కోసమే ఈ మూవీని రూపొందించాను. మీకూ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీ రివ్యూ కోసం ఎదురుచూస్తుంటాను సర్` అంటూ కేటీఆర్ ని కోరారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
సత్యదేవ్ హీరోగా గోపీగణేష్ రూపొందించిన చిత్రం `గాడ్సే`. యువత, సమకాలీన రాజకీయాంశాల నేపథ్యంలో ఈ మూవీని రూపొందించారు. సి. కల్యాణ్ నిర్మించిన ఈ సినిమాని జూన్ 17న విడుదల చేసిన విషయం తెలిసిందే. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ జూలై 17న నుంచి ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.