Begin typing your search above and press return to search.
ఆ టీజర్.. టాక్ ఆఫ్ ద ఇండియా
By: Tupaki Desk | 6 Feb 2018 4:27 AM GMTఇంతకుముందు అక్షయ్ కుమార్ అంటే రొటీన్ యాక్షన్.. కామెడీ సినిమాలు చేసే ఒక మామూలు హీరోగా కనిపించేవాడు. కానీ గత ఐదారేళ్లలో అతడి ఇమేజే మారిపోయింది. అమీర్ ఖాన్ తర్వాత అంత వైవిధ్యమైన కథలతో.. భిన్నమైన సినిమాలు చేస్తూ క్రమ క్రమంగా తన ఇమేజ్ పెంచుకుంటూ గొప్ప పేరు సంపాదించాడు అక్షయ్. గత ఏడాది అక్షయ్ నుంచి వచ్చిన ‘ఎయిర్ లిఫ్ట్’.. ‘జాలీ ఎల్ ఎల్బీ-2’.. ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’ అతడి ఇమేజ్ ను మరింత పెంచాయి. ఈ వారాంతంలో రిలీజ్ కాబోయే ‘ప్యాడ్ మ్యాన్’పై ఇప్పటికే చాలా చర్చ నడిచింది. దీని తర్వాత అక్షయ్ నుంచి రాబోయే ‘గోల్డ్’ కూడా అతడి కెరీర్లో ఒక మైలురాయిలా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నిన్న సాయంత్రమే రిలీజైన ‘గోల్డ్’ టీజర్ టాక్ ఆఫ్ ద ఇండియన్ సినిమా అయింది. స్వాతంత్ర్యం రావడానికంటే ముందు ఇండియాకు ఒలింపిక్స్ హాకీలో స్వర్ణం సాధించిపెట్టేందుకు ఓ ప్లేయర్ చేసిన పోరాటం నేపథ్యంలో సాగే కథ ఇది. అప్పటి నేపథ్యాన్ని చాలా చక్కగా చూపించినట్లున్నారు ఈ సినిమాలో. ఇంటెన్సిటీ ఉన్న సినిమాలా కనిపిస్తోంది టీజర్ చూస్తుంటే. అక్షయ్ కుమార్ ఎప్పట్లాగే అదరగొట్టేసినట్లున్నాడు. ఫర్హాన్ అక్తర్ చెల్లెలు రీమా కగ్తి ఈ చిత్రాన్ని రూపొందించింది. ఇంతకుముందు ఇంతకుముందు ఆమె ‘హనీమూన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్’.. ‘తలాష్’ లాంటి వైవిధ్యమైన సినిమాలు రూపొందించింది. ఫర్హాన్ అక్తర్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించాడు. బాలీవుడ్లో స్పోర్ట్స్ బేస్డ్ సినిమాలన్నీ దాదాపుగా విజయం సాధించాయి. మరి ‘గోల్డ్’ కూడా ఆ కోవలోకే చేరుతుందేమో చూడాలి.