Begin typing your search above and press return to search.
'ఆదిపురుష్ 3డి' కి గోల్డెన్ ఛాన్స్ మిస్?!
By: Tupaki Desk | 13 Jan 2023 4:12 AM GMTపురాణేతిహాసం రామాయణం స్ఫూర్తితో ఓం రౌత్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం 'ఆదిపురుష్ 3డి' 12 జనవరి 2023న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. దాదాపు ఆరు నెలల పాటు విడుదల తేదీ దూరం జరిగింది. 16 జూన్ 2023న విడుదల చేస్తామని ఓంరౌత్ అండ్ టీమ్ ప్రకటించడం ఆశ్చర్యపరిచింది.
దానికి కారణం సుస్పష్టం. ఆదిపురుష్ టీజర్ ఆన్ లైన్ లో విడుదల కాగా... పేలవమైన VFX తో తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. అంతేకాదు రామాయణం స్ఫూర్తితో అంటూ పాత్రలను తప్పుదోవ పట్టించారన్న విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభాస్ - ఓంరౌత్ బృందాలు ఎంతో జాగ్రత్త పడుతూ వాయిదా నిర్ణయాన్ని తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఇలాంటి ప్రతిష్ఠాత్మక ఇతిహాస డ్రామాలో పాత్రలను తప్పుగా చిత్రీకరించడంతో మతపరమైన మనోభావాలను దెబ్బతీసారని కూడా ఆరోపణలు వెల్లువెత్తడంతో టీమ్ అలెర్ట్ అయింది.
వీక్షకులకు అత్యుత్తమ విజువల్ ఫీస్ట్ ని అందించాలంటే పని చేస్తున్న టీమ్ లకు మరింత సమయం కేటాయించాలని అందుకే ఆదిపురుష్ ని వాయిదా వేస్తున్నామని ఓంరౌత్ ప్రకటించారు. భారతదేశం గర్వించదగ్గ సినిమా చేయడానికి మేమంతా కట్టుబడి ఉన్నాం. మీ మద్దతు ప్రేమ దీవెనలే మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాయి.. అని కూడా అన్నారు.
నిజానికి ఈ సంక్రాంతి బరిలో పందెం పుంజుల్లా బరిలో దిగిన వీరసింహారెడ్డి- వాల్తేరు వీరయ్యలకు గట్టి పోటీనిచ్చే చిత్రంగా ఆదిపురుష్ 3డి నిలవాల్సి ఉంది. కానీ అది అనూహ్యంగా వాయిదా పడింది. నిజానికి సంక్రాంతి సీజన్ ని ఆదిపురుష్ మిస్ చేసుకోవడం అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. అయినా మంచి విజువల్ ఫీస్ట్ గా బెటర్ మెంట్ చేసేందుకు మరో ఆరునెలల సమయాన్ని ఆదిపురుష్ టీమ్ తీసుకుంటోంది.
కానీ ఈ సంక్రాంతి పందెంలోంచి ప్రభాస్ తప్పుకోవం చిరంజీవి - బాలకృష్ణ సినిమాలకు ఏమేరకు సహకరిస్తుందో వేచి చూడాలి. పండగ పందెంలో మొత్తం మూడు భారీ చిత్రాలతో పాటు ఇతర చిన్న సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. 12 జనవరి 13 జనవరి 14 జనవరి వంటి కీలక తేదీల్లో మూడు భారీ సినిమాలు విడుదల అభిమానుల్లో బోలెడంత సందడిని పెంచింది.
ఆదిపురుష్ 3డి చిత్రంలో రాముడిగా ప్రభాస్.. సీతగా కృతి సనన్ .. రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. 'ఆదిపురుష్' అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుందని సమాచారం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

ఆదిపురుష్ ని విజువల్ గా మరింత మెరుగుపరచడానికి టీమ్ కృషి చేస్తోందని ఓం రౌత్ ఆ తర్వాత వెల్లడించారు. ఆదిపురుష్ అనేది సినిమా కాదు... ప్రభు శ్రీరాముడిపై మనకున్న భక్తిని మన సంస్కృతిని చరిత్రపై ప్రజలకు ఉన్న నిబద్ధతను తెరపై ఆవిష్కరిస్తున్నామని సుదీర్ఘ వివరణ కూడా ఇచ్చుకున్నారు.